Mon Dec 23 2024 01:48:25 GMT+0000 (Coordinated Universal Time)
ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలివే..
కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఏప్రిల్ 21న థియేటర్లలో విడుదల కానుంది. కాకర్ల శ్రీనివాసు
సినిమాలు, వెబ్ సిరీస్ ల గురించి చెప్పాలంటే.. కరోనా ముందు.. కరోనా తర్వాత అని చెప్పాలి. కరోనా రాకముందు ఇన్నిరకాల ఓటీటీలు, థియేటర్లలో వచ్చిన సినిమాలు నెలరోజులకే వాటిలో స్ట్రీమింగ్ కు రావడం, వెబ్ సిరీస్ లు ఇవేవీ లేవు. కానీ.. లాక్ డౌన్ పుణ్యమా అని ఓటీటీ ప్లాట్ ఫారమ్ లు ప్రేక్షకుల ముందుకొచ్చి ఇంటిల్లిపాదికీ వినోదాన్నిస్తున్నాయి. ఫలితంగా కంటెంట్ ఉన్న సినిమాలు కూడా అంతంతమాత్రంగానే థియేటర్లలో ఆడుతున్నాయి. పెద్దహీరోల సినిమాలైనా సరే.. కథ నచ్చితే తప్ప హిట్ అవడం లేదు. ప్రతివారం వివిధ ఓటీటీ ప్లాట్ ఫారమ్ లలో తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదలవుతూ వినోదాన్ని అందిస్తున్నాయి.
ఈ వారం థియేటర్లలో రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీటిలో ఒకటి మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష. ఈ హీరో సింగిల్ గా ఎలాంటి పోటీ లేకుండా చాలాకాలం తర్వాత ప్రేక్షకుల ముందుకి విరూపాక్షగా రాబోతున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఏప్రిల్ 21న థియేటర్లలో విడుదల కానుంది. కాకర్ల శ్రీనివాసు దర్శకుడిగా పరిచయమవుతూ.. గార్గేయి యల్లాప్రగడ ప్రధానపాత్రలో తెరకెక్కిన సినిమా హలో మీరా. ఒకే ఒక్క క్యారెక్టర్ తో.. సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ గా ఈ సినిమాను రూపొందించారు. ఇది కూడా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈ వారం ఒక్క నెట్ ఫ్లిక్స్ లోనే 10 సినిమాలు స్ట్రీమింగ్ కు రానున్నాయి. వీటిలో ఎక్కువ ఇంగ్లీష్ సినిమాలే ఉన్నాయి.
నెట్‌ఫ్లిక్స్
హౌ టు గెట్ రిచ్ (ఇంగ్లీష్) - ఏప్రిల్ 18
చింప్ ఎంపైర్ (డాక్యుమెంటరీ) -ఏప్రిల్ 19
ది మార్క్డ్ హార్ట్ (సీజన్2) - ఏప్రిల్ 19
చోటా భీమ్ (సీజన్-17) - ఏప్రిల్ 20
టూత్‌పరి (హిందీ) - ఏప్రిల్ 20
డిప్లొమ్యాట్ (ఇంగ్లీష్) - ఏప్రిల్ 20
సత్య2 (తెలుగు) -ఏప్రిల్ 21
రెడీ (తెలుగు) -ఏప్రిల్ 21
ఇండియన్ మ్యాచ్ మేకింగ్ (వెబ్‌సిరీస్) - ఏప్రిల్ 21
ఎ టూరిస్ట్స్ గైడ్ టు లవ్ (ఇంగ్లీష్) - ఏప్రిల్ 21
సోనీలివ్
గర్మీ (సిరీస్)
హాట్‌స్టార్
సుగా (డాక్యుమెంటరీ)- ఏప్రిల్ 21
Next Story