Mon Dec 23 2024 11:39:06 GMT+0000 (Coordinated Universal Time)
Vijay Deverakonda: విజయ్ దేవరకొండని చూసి ఫుల్ ఎగ్జైట్ అయిన పెళ్లికూతురు..
విజయ్ దేవరకొండని చూసి ఫుల్ ఎగ్జైట్ అయ్యిపోయిన దిల్ రాజు కొత్త కోడలు అద్విత. వైరల్ అవుతున్న వీడియో.
Vijay Deverakonda : టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకి అమ్మాయిల్లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనని ఒక్కసారైనా దగ్గర నుంచి చూడాలని కలకంటూ ఉంటారు. అయితే ఆ కల కొందరికే నెరవేరుతుంది. తాజాగా అలాంటి ఓ అభిమాని కల నిజమైంది. తన పెళ్ళికి వచ్చిన విజయ్ ని చూసి ఫుల్ ఎగ్జైట్ అయ్యిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సోదరుడు అయిన శిరీష్ కుమారుడు ఆశిష్ వివాహం ఫిబ్రవరి 14న జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవలే హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆశిష్.. ఇప్పుడు 'అద్విత'ని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నారు. ఇక ఈ పెళ్లిని జైపూర్ ప్యాలెస్ లో ఘనంగా జరుపుకున్న ఈ జంట.. ఫిబ్రవరి 23న అంటే నిన్న హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ లో రిసెప్షన్ ని జరుపుకున్నారు. ఇక ఈ ఫంక్షన్ కి సినీ, రాజకీయ సెలబ్రిటీస్ అతిథులుగా వచ్చారు.
ఈక్రమంలోనే విజయ్ దేవరకొండ కూడా వివాహానికి వచ్చారు. అయితే పెళ్లికూతురు అద్విత.. విజయ్ కి బిగ్ ఫ్యాన్ అంట. ఇంకేముంది విజయ్ ని చూడగానే ఫుల్ ఎగ్జైట్ అయ్యిపోయింది. పక్కన ఉన్నవారిని ఎవరిని పట్టించుకోకుండా విజయ్ నే చూస్తూ ఉండిపోయింది. ఇక అద్విత, విజయ్ కి ఎంత పెద్ద అభిమానో.. అనేది విజయ్ కి శిరీష్ వివరిస్తూ వచ్చాడు. అది విన్న విజయ్ ఆమెతో ఫోటో దిగి, ఆమెతో మాట్లాడి సంతోష పరిచారు. ప్రస్తుతం ఈ వీడియోని విజయ్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
Next Story