Thu Dec 26 2024 11:03:43 GMT+0000 (Coordinated Universal Time)
అభిమానులకు అలర్ట్.. హీరో కార్తీ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్
హీరో కార్తీ ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతోన్నాడు. మణిరత్నం పొన్నియిన్ సెల్వన్లో వల్లవరాయ గా.. సర్దార్ సినిమాలో..
తమిళ, తెలుగు చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కార్తీ తెరపైనే కాకుండా.. సోషల్ మీడియాలోనూ అభిమానులను అలరిస్తుంటాడు. నెట్టింట్లో ఫుల్ యాక్టివ్గా ఉండే కార్తీ.. ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయిందట. ఈ విషయాన్ని కార్తీ నే ట్విట్టర్ ద్వారా వెల్లడించి.. తన అభిమానులను అప్రమత్తం చేశాడు. హలో గాయ్స్.. నా ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ అయింది.. ఫేస్ బుక్ టీంతో కలిసి పని చేస్తున్నాం.. నా పేజీని తిరిగి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చాడు.
హీరో కార్తీ ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతోన్నాడు. మణిరత్నం పొన్నియిన్ సెల్వన్లో వల్లవరాయ గా.. సర్దార్ సినిమాలో విభిన్న పాత్రలతో అలరించి.. వరుసగా రెండు హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. వాటర్ బాటిళ్ల స్కాం నేపథ్యంలో సర్దార్ సినిమాను తీశారు. కార్తీ నటిస్తోన్న మరో సినిమా జపాన్ అప్డేట్ నేడు రానుంది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ మీద నిర్మిస్తోన్న ఈ సినిమాకు రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
కాగా.. సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అవ్వడం కొత్తేమీ కాదు. ఎప్పుడూ ఎవరిదో ఒకరిది ఇలా హ్యాక్ అవుతూనే ఉంటుంది. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లను హ్యాక్ చేస్తుంటారు. సెలబ్రిటీల ఫేస్ బుక్ పేజీలను హ్యాక్ చేసి.. అందులో నానా చండాలం చేస్తుంటారు. యాంకర్, నటి విష్ణుప్రియ ఫేస్ బుక్ పేజ్ లో ఇదే జరుగుతోంది. అన్నీ అశ్లీల వీడియోలు, ఫోటోలు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇంత వరకు విష్ణుప్రియ తన ఫేస్ బుక్ ఖాతా సమస్యలను పరిష్కరించుకోలేకపోయింది.
Next Story