Mon Dec 23 2024 16:11:16 GMT+0000 (Coordinated Universal Time)
Krishna : కృష్ణ చివరి ఫోటో.. తండ్రి చెయ్యి పట్టుకొని సపోర్ట్‌గా మహేష్..
కృష్ణ చివరిగా కనిపించిన ఫోటో ఇదే. తండ్రి చెయ్యి పట్టుకొని సపోర్ట్‌గా మహేష్ కనిపిస్తూ..
Krishna : సూపర్ స్టార్ కృష్ణ 79 ఏళ్ళ వయసులో గత ఏడాది నవంబర్ 15న మరణించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిన సంగతి అందరికి తెలిసిందే. ఘట్టమనేని ఫ్యామిలీ 2022వ సంవత్సరం చాలా బాధను ఎదురుకుంది. రమేష్ బాబు, ఇందిరా దేవి, కృష్ణ.. ఇలా వరసగా ఒకరి తరువాత ఒకరు నెలలు వ్యవధిలో అందరూ స్వర్గస్తులు అవుతూ వచ్చారు. వీరి మరణాలతో మహేష్ బాబు అతని సిస్టర్స్ తీవ్ర శోకాన్ని అనుభవించారు.
కాగా నేడు నవంబర్ 8న కృష్ణ కుమార్తె నటి మంజుల పుట్టినరోజు కావడంతో.. ఆమె సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ వేశారు. గత ఏడాది ఆమె పుట్టినరోజుని తండ్రి కృష్ణ సమక్షంలో కలిసి జరుపుకున్న ఫోటో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. మంజుల ప్రతి బర్త్ డేకి కృష్ణ ఎప్పుడు తన పక్కనే ఉంటారని చెప్పుకొచ్చారు. మా నాన్న చివరిగా కనిపించిన ఫోటో ఇది. ఆయనతో చివరిగా సెలబ్రేట్ చేసుకున్న సందర్భం ఇది అంటూ గుర్తు చేసుకున్నారు.
ఆ ఫోటో ఆమెకు ఎన్నో జ్ఞాపకాలు గుర్తు చేస్తుందని, అది ఆమెకు ప్రపంచమని పేర్కొన్నారు. ఈ జ్ఞాపకం ఎప్పటికి తనలో నిలిచిపోతుంది అంటూ మంజుల ఎమోషనల్ గా రాసుకొచ్చారు. ఈ ఫొటోలో మహేష్ బాబు, నమ్రతా కూడా కనిపిస్తున్నారు. మహేష్ తన తండ్రి చేతిని పట్టుకొని సపోర్ట్ గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు వైపు మీరుకూడా ఒక లుక్ వేసేయండి.
ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగిన వారానికే కృష్ణ తుది శ్వాస విడిచారు. నవంబర్ 15న అనారోగ్య సమస్యలతో కృష్ణ మరణించారు. బుర్రిపాలెం నుంచి వచ్చి ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎదిగిన కృష్ణకి.. బుర్రిపాలెం ప్రజలు ఒక తమ గ్రామంలో ఒక విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ ఏడాది కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న ఈ విగ్రహాన్ని ఓపెన్ చేశారు.
Next Story