Tue Nov 05 2024 19:51:23 GMT+0000 (Coordinated Universal Time)
సినిమా టికెట్ల రేట్లపై స్పందించిన నాగచైతన్య.. బంగార్రాజుకు అంతా ఓకేనా ?
ఏపీలో సినిమా టికెట్ల రేట్ల గురించి నాన్నతో చాలాసార్లు చర్చించినట్లు చెప్పుకొచ్చారు. "ఏపీలో సినిమా టికెట్ల రేట్లపై
అక్కినేని నాగార్జున, నాగచైతన్య లు ప్రధాన పాత్రల్లో.. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రాబోతోన్న సినిమా బంగార్రాజు - సోగ్గాడు మళ్లీపుట్టాడు. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్ గా వస్తోన్న ఈ సినిమా జనవరి 14వ తేదీ (రేపు) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో ఏపీలో సినిమా టికెట్ల రేట్లపై కూడా స్పందించాడు.
Also Read : ఆర్ఆర్ఆర్ రివ్యూ.. ఉమైర్ సంధు ట్వీట్ వైరల్ !
ఏపీలో సినిమా టికెట్ల రేట్ల గురించి నాన్నతో చాలాసార్లు చర్చించినట్లు చెప్పుకొచ్చారు. "ఏపీలో సినిమా టికెట్ల రేట్లపై గతేడాది ఏప్రిల్ 8వ తేదీన జీఓ వచ్చినట్లుంది. బంగార్రాజు షూటింగ్ ను మేము ఆగస్టులో మొదలుపెట్టాం. అప్పట్లో ఉన్న టికెట్ ధరలను దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గ బడ్జెట్ లో ఈ సినిమా చేశాం. భవిష్యత్తులో సినిమా టికెట్ ధరలు పెరిగితే మనకు బోనస్ అవుతుందని నాన్న అన్నారు. థ్యాంక్యూ సినిమా అంటే నిర్మాత దిల్ రాజు గారు చూసుకుంటారు. నేను సినిమా చేసేముందు నిర్మాతతో మాట్లాడతాను. ఆయనకు కంఫర్ట్ అయితే నాకు కంఫర్ట్. ఇక రాజకీయపరమైన నిర్ణయాలకు విభిన్నమైన కారణాలు ఉండొచ్చు. నేను అందుకు వ్యతిరేకం కాదు. ఉన్న పరిస్థితులను బట్టి మనం ముందుకు వెళ్లాలి" అని చైతన్య తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
News Summary - Hero Naga Chaitanya Shares his Opinion on AP Movie Tickets Rates Issue
Next Story