Mon Dec 23 2024 07:09:48 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లి తర్వాత తొలిసారి భార్యతో ఫొటో షేర్ చేసిన నాగశౌర్య
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో ఉన్న ఈ హీరో.. గతేడాది నవంబర్ 20న తన ప్రియురాలైన అనూష శెట్టిని..
టాలీవుడ్ హీరో నాగశౌర్య.. ఇప్పుడు యువతులకు హ్యాండ్సమ్ హంక్. ఊహలు గుసగుసలాడే సినిమాతో మొదలైన నాగశౌర్య సినీ ప్రయాణం.. అలా సాగుతూ ఉంది. రొటీన్ కి భిన్నంగా కథలను ఎంచుకుంటూ.. సినిమాలు చేస్తున్న హీరోల్లో నాగశౌర్య ఒకరు. లక్ష్మీ రావే మా ఇంటికి, జ్యో అచ్యుతానంద, దిక్కులు చూడకు రామయ్య, ఛలో,జాదుగాడు, కల్యాణ వైభోగమే, ఓ బేబీ, అశ్వత్థామ, నర్తనశాల, వరుడు కావలెను, కృష్ణ వ్రింద విహారి ఇలా వివిధ రకాల సినిమాలను తీశాడు నాగశౌర్య.
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో ఉన్న ఈ హీరో.. గతేడాది నవంబర్ 20న తన ప్రియురాలైన అనూష శెట్టిని పెళ్లాడాడు. బెంగళూరులోని ఓ ఫంక్షన్ హాల్ లో బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. కానీ పెళ్లి తర్వాత ఇంతవరకూ.. నాగశౌర్య తన భార్యతో కలిసి దిగిన ఒక్క ఫొటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది లేదు. తాజాగా.. అనూష శెట్టితో కలిసి దిగిన ఫోటోని తన ఇన్ స్టా హ్యాండిల్ లో షేర్ చేస్తూ.. శ్రీమతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. జీవితం మన దారిలో ఎలా ఉన్నా, నేను నీతో దానిని అధిగమించగలనని నాకు తెలుసు.. హ్యాపీ బర్త్ డే మై వరల్డ్ అంటూ కింద రాసుకొచ్చాడు శౌర్య. ఈ ఫోటో నెటిజన్లను ఆకర్షిస్తోంది. బ్యూటిఫుల్ కపుల్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Next Story