Tue Dec 24 2024 00:39:54 GMT+0000 (Coordinated Universal Time)
చిరంజీవి వెళితే హ్యాపీ ఎండింగే
మెగాస్టార్ చిరంజీవి, ముఖ్యమంత్రి జగన్ భేటీ పై హీరో నాగార్జున స్పందించారు.
మెగాస్టార్ చిరంజీవి, ముఖ్యమంత్రి జగన్ భేటీ పై హీరో నాగార్జున స్పందించారు. చిరంజీవి వెళ్లారంటే ఖచ్చితంగా చిత్ర పరిశ్రమకు గుడ్ న్యూస్ వస్తుందని తెలిపారు. సినీ ఇండ్రస్ట్రీకి హ్యాపీ ఎండింగ్ వస్తుందని నాగార్జున అభిప్రాయపడ్డారు. చిత్ర పరిశ్రమ లో తలెత్తిన సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని నాగార్జున ఆశాభావం వ్యక్తం చేశారు.
చిత్ర పరిశ్రమ సమస్యలను.....
ఇటీవల చిరంజీవి ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయి సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించిన సంగతి తెలిసిందే. ఆ సమస్యలకు జగన్ సానుకూలంగా స్పందించారని, విత్ ఇన్ నో టైమ్ ఎండింగ్ లభిస్తుందని చిరంజీవి చెప్పారు. మూవీ టిక్కెట్ల తగ్గింపు మాత్రమే కాకుండా ఇతర సమస్యలపై కూడా జగన్ దృష్టి పెట్టి పరిష్కరిస్తారని చిత్ర పరిశ్రమ ఆశాభావం వ్యక్తం చేస్తుంది.
Next Story