Thu Dec 19 2024 16:42:56 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభాస్ సినిమాకు టికెట్లు పంచుతున్న మరో హీరో
ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది
ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ పెద్దగా జరగకపోయినా సినిమాకు హైప్ మాత్రం రోజు రోజుకీ పెరిగిపోతూ ఉంది. పలు రాష్ట్రాలలో ఇప్పటికే బెనిఫిట్ షోలు కన్ఫర్మ్ చేసేశారు. టికెట్స్ కోసం థియేటర్లకు ఫోన్లు చేసే వారు కొందరైతే.. ఆన్ లైన్ లో ఎప్పుడు దొరుకుతాయా అని ఎదురుచూసే వారు మరికొందరు. అయితే ఈ సినిమాకు టాలీవుడ్ హీరో నిఖిల్ 100 టికెట్లను ఉచితంగా పంచేస్తూ ఉన్నాడు.
నిఖిల్ అందుకు సంబంధించి ట్విట్టర్లో ఓ ట్వీట్ చేశాడు. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ కోసం హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్లో డిసెంబర్ 21 అర్ధరాత్రి ఒంటి గంటకు సలార్ షో పడుతుందని.. ఈ షోకి 100 మంది డై హార్డ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫ్రీగా టికెట్స్ ఇస్తానని, వారితో కలిసి నేను కూడా సినిమా చూస్తానని చెప్పాడు. 10 ఏళ్ళ క్రితం అదే థియేటర్లో రాత్రి ఒంటిగంటకు రిలీజ్ రోజు మిర్చి సినిమా చూశాను, ఇప్పుడు హిస్టరీ మళ్ళీ రిపీట్ అవుతుంది అంటూ ట్వీట్ చేశాడు నిఖిల్. నిఖిల్ దగ్గర్నుంచి సలార్ సినిమా టికెట్స్ ను ఎవరు అందుకుంటారో చూడాలి. దీనికి ఏమైనా కాంటెస్ట్ పెడుతాడా అని కూడా ప్రశ్నలు అడుగుతున్నారు ప్రభాస్ అభిమానులు.
Next Story