రవితేజ కారు గురించి ముచ్చట్లు..!
కార్లు అంటే ఎవరికి పిచ్చి ఉండదు చెప్పండి. అలానే మన టాలీవుడ్ స్టార్స్ కి కూడా కార్లు అంటే తెగ పిచ్చి. మార్కెట్ లోకి ఏ కార్ [more]
కార్లు అంటే ఎవరికి పిచ్చి ఉండదు చెప్పండి. అలానే మన టాలీవుడ్ స్టార్స్ కి కూడా కార్లు అంటే తెగ పిచ్చి. మార్కెట్ లోకి ఏ కార్ [more]
కార్లు అంటే ఎవరికి పిచ్చి ఉండదు చెప్పండి. అలానే మన టాలీవుడ్ స్టార్స్ కి కూడా కార్లు అంటే తెగ పిచ్చి. మార్కెట్ లోకి ఏ కార్ వచ్చినా వెంటనే తమ వద్ద ఉండాలని చూస్తారు మన హీరోస్. టాలీవుడ్ లో టాప్ హీరోలంతా ఖరీదైన హై ఎండ్ కార్లని ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, ప్రభాస్, నాగార్జున, చిరంజీవి, అఖిల్, నాగ చైతన్య, అల్లు అర్జున్ ఇలా చాలామంది టాప్ ఎండ్ కార్లనే యూజ్ చేస్తుంటారు. అన్ని సౌకర్యాలు ఉన్న హైక్లాస్ కార్స్ ని ఉపయోగిస్తున్నారు. వీరందరికి పోటీగా మాస్ మహారాజా రవితేజ మెయింటైన్ చేస్తున్న లగ్జరీ కార్స్ ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది.
మూడు టాప్ కార్లు…
ప్రస్తుతం రవితేజ రేంజ్ రోవర్ ఎవోక్ యూజ్ చేస్తున్నాడు. దీని విలువ రూ.63.82 లక్షలు ఉంటుందట. అలానే బీఎండబ్ల్యూ ఎం 6 కారు యూజ్ చేస్తున్నాడు. దీని విలువ రూ.1.24 కోట్లు అని తెలుస్తుంది. అయితే వీటన్నిటి కంటే కాస్ట్లీగా మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ రవితేజ వద్ద ఉంది. దాని విలువ రూ.2.43 కోట్లు. ఈ మూడు కార్లు సందర్భాన్ని బట్టి రవితేజ ఉపయోగిస్తుంటారు. కెరీర్ పరంగా చూసుకుంటే రవితేజ పరిస్థితి ఏమీ అంతగా బాగోలేదు. ప్రస్తుతం అతను 'డిస్కో రాజా' అనే చిత్రంలో నటిస్తున్నాడు.