ఆ సినిమాల గురించి పటించుకోను
ఈ నెల 21న నాలుగు సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. రెండు స్ట్రెయిట్ మూవీస్, రెండు డబ్బింగ్ మూవీస్ తెలుగు ప్రేక్షకులను పలుకరిస్తున్నాయి. తెలుగులో రెండు స్ట్రెయిట్ మూవీస్ లో ఒకటి శర్వానంద్ నటించిన 'పడి పడి లేచే మనసు' కాగా ఇంకోటి వరుణ్ తేజ్ నటించిన 'అంతరిక్షం'. రీసెంట్ గా ప్రమోషన్స్ లో భాగంగా మీ సినిమాతో పాటు మరో సినిమా కూడా రిలీజ్ అవుతుంది కదా..? అని మీడియా అడిగిన ప్రశ్నకు శర్వా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు. 'అంతరిక్షం' సినిమా మా తమ్ముడిదే కదా పోటీ ఎలా అవుతుంది. పైగా నేను చిన్నప్పటి నుండి మెగా ఫ్యామిలీతో కలిసి పెరిగాను. స్కూల్ డేస్ నుండి మేమంతా స్నేహితులమేనని శర్వానంద్ అన్నారు. ఒకరి కష్టం ఒకరికి తెలుసని, అందుకే తమ మధ్య ఎటువంటి పొరపొచ్చాలు ఉండవని చెప్పాడు.
అవి పోటీ ఎలా అవతాయి..?
అలానే మీ రెండు సినిమాలతో పాటు రెండు డబ్బింగ్ మూవీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి కదా అని అడిగిన ప్రశ్నకు షాకింగ్ కామెంట్ చేసాడు. "నేను ఆ సినిమాలని ఏమాత్రం పటించుకోను. అసలు డబ్బింగ్ సినిమాలను పోటీ అని ఎలా అంటాం..? నా దృష్టిలో పోటీ అనాల్సి వస్తే 'అంతరిక్షం' ఒకటే" అని వ్యాఖ్యానించారు. ఆ రోజు విడుదల అయ్యే డబ్బింగ్ సినిమాలు 'కె.జి.ఎఫ్' 'మారి -2' గురించే శర్వా అలా కామెంట్ చేసాడు. 'పడి పడి లేచే మనసు' సినిమా రిజల్ట్ విషయంలో తాను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నానని చెప్పాడు.