Sun Dec 22 2024 22:27:37 GMT+0000 (Coordinated Universal Time)
త్వరలో పెళ్లిపీటలెక్కకున్న శర్వానంద్.. ఎన్నారై పెళ్లికూతురు ?
బాలయ్య హోస్ట్ గా వస్తోన్న అన్ స్టాపబుల్ 2 కి శర్వానంద్, అడివి శేష్ లు గెస్టులుగా వచ్చిన సమయంలో..
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోల లిస్ట్ తీస్తే.. అందులో శర్వానంద్ కూడా ఒకరు. ఇటీవల కాలంలో శర్వానంద్ పెళ్లిపై చాలా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. బాలయ్య హోస్ట్ గా వస్తోన్న అన్ స్టాపబుల్ 2 కి శర్వానంద్, అడివి శేష్ లు గెస్టులుగా వచ్చిన సమయంలో.. వాళ్లిద్దరి పెళ్లి ప్రస్తావన తెచ్చారు బాలకృష్ణ. ప్రభాస్ తర్వాత చేసుకుంటానని ముందు చెప్పినా.. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చేశాడు శర్వానంద్. అప్పటి నుండి శర్వానంద్ చేసుకోబోయే అమ్మాయి ఎవరా ? అని తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు.
తాజాగా మరోసారి శర్వా పెళ్లి పై.. వార్తలు గుప్పుమన్నాయి. శర్వానంద్ ఓ ఎన్నారై యువతితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె పేరుకి ఎన్నారై సాఫ్ట్ వేర్ అయినా.. ప్రస్తుతం కరోనా కారణంగా హైదరాబాద్ లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుందని సమాచారం. కొంతకాలంగా ప్రేమలో ఉన్న శర్వానంద్.. త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడని టాలీవుడ్ వర్గం పేర్కొంది. పెళ్లి విషయంపై శర్వానంద్ త్వరలోనే ప్రకటన చేస్తాడని తెలుస్తోంది.
Next Story