Sun Dec 22 2024 23:05:38 GMT+0000 (Coordinated Universal Time)
రోడ్డు ప్రమాదంలో గాయపడిన శర్వానంద్?
హైదరాబాద్ ఫిలింనగర్ వద్ద శర్వానంద్ ప్రయాణిస్తోన్న కారు డివైడర్ ను ఢీ కొట్టింది. ఆదివారం తెల్లవారుజామున..
టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవ్వగా.. శర్వానంద్ కు గాయాలైనట్లు ప్రచారం జరిగింది. హైదరాబాద్ ఫిలింనగర్ వద్ద శర్వానంద్ ప్రయాణిస్తోన్న కారు డివైడర్ ను ఢీ కొట్టింది. ఆదివారం తెల్లవారుజామున రాంగ్ రూట్ లో వస్తోన్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. శర్వానంద్ కు స్వల్ప గాయాలయ్యాయని తొలుత చెప్పారు. ఆ తర్వాత ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది. ప్రమాదంలో శర్వానంద్ కు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపింది. కారులో ఉన్న అందరూ క్షేమంగానే ఉన్నారని వెల్లడించింది.
కాగా.. జూన్ 2,3 తేదీల్లో శర్వానంద్ - రక్షిత రెడ్డిల వివాహం రాజస్థాన్ జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో జరగనుంది. నాలుగురోజుల్లో పెళ్లి కార్యక్రమం ఉన్న నేపథ్యంలో శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన చెందారు. పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 2,3 తేదీల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో శర్వానంద్ - రక్షిత పెళ్లి జరగనుంది. ఈ వేడుకకు శర్వానంద్ చిన్ననాటి స్నేహితుడైన ఇప్పటి పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
Next Story