Mon Dec 23 2024 07:52:49 GMT+0000 (Coordinated Universal Time)
ఈ రోజుల్లో విడాకులు చాలా కామన్ : హీరో సుమంత్
నాకు తెలిసిన చాలా మంది విడాకులు తీసుకున్నారు. మా కుటుంబంలో కూడా విడాకులున్నాయి. దురదృష్టవశాత్తూ ఇప్పుడు
టాలీవుడ్ హీరో సుమంత్.. చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంటారు. ఆయన చేసే సినిమాల్లో మంచి కంటెంట్ ఉంటుంది. తాజాగా ఆయన నటించిన చిత్రం "మళ్లీ మొదలైంది". ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవ్వనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో ఫిబ్రవరి 11వ తేదీన "మళ్లీ మొదలైంది" విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సుమంత్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. అలా ఒక ఇంటర్వ్యూలో సుమంత్ విడాకుల అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Also Read : పోలీసులపై జగన్ ఫైర్.. విచారణకు ఆదేశం
విడాకుల గురించి మాట్లాడుతూ.. "నాకు తెలిసిన చాలా మంది విడాకులు తీసుకున్నారు. మా కుటుంబంలో కూడా విడాకులున్నాయి. దురదృష్టవశాత్తూ ఇప్పుడు విడాకులు అనేవి చాలా కామన్ అయిపోయాయి. ఈ విషయంలో దురదృష్టం అని కూడా అనలేము. అలా జరుగుతున్నాయంతే. కానీ రెండో పెళ్లి విషయానికొచ్చేసరికి కొన్ని కష్టాలున్నప్పటికీ సర్ధుకుపోతున్నారు. రెండో పెళ్లి కూడా ఫెయిల్ అయితే ఒక నెగిటివ్ ముద్ర పడిపోతుందని చాలా మంది రెండో పెళ్లిని ఎలాగోలా కొనసాగించాలని అంతా అనుకుంటున్నారు." అని సుమంత్ పేర్కొన్నారు.
Also Read : కేసీఆర్ ట్రాప్ లో పడిపోయారా?
తొలిప్రేమ ఫేమ్ కీర్తిరెడ్డిని పెళ్లాడిన సుమంత్.. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఇటీవలే అక్కినేని వారి కుటుంబంలో సమంత - నాగచైతన్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా విడాకులపై సుమంత్ చేసిన కామెంట్స్ ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
Next Story