Fri Dec 27 2024 21:35:45 GMT+0000 (Coordinated Universal Time)
నడిరోడ్డుపై విశ్వక్ సేన్ మూవీ ప్రమోషన్స్ ప్రాంక్.. హెచ్ఆర్సీకి ఫిర్యాదు ?
శ్వక్ కారులో వెళ్తుండగా.. ఓ అభిమాని అర్జున్ కుమార్ అల్లం ఎక్కడ అంటూ.. కారుకు అడ్డుపడతాడు. తనను..
హైదరాబాద్ : టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో చాలా గ్యాప్ తర్వాత వస్తోన్న సినిమా.. అశోకవనంలో అర్జున కల్యాణం. ఈ సినిమాలో విశ్వక్.. అల్లం అర్జున్ కుమార్ గా కనిపించనున్నాడు. వయసు మీదపడుతున్నా పెళ్లి కాని యువకుడిగా విశ్వక్ నటించిన ఈ సినిమా మే 6న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా విడుదల దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ ను వేగవతం చేసింది చిత్రబృందం.
ప్రమోషన్లలో భాగంగా.. హైదరాబాద్ లో నడిరోడ్డుపై ఓ ప్రాంక్ వీడియో చేశాడు విశ్వక్ సేన్. విశ్వక్ కారులో వెళ్తుండగా.. ఓ అభిమాని అర్జున్ కుమార్ అల్లం ఎక్కడ అంటూ.. కారుకు అడ్డుపడతాడు. తనను అర్జున్ కుమార్ దగ్గరికి తీసుకెళ్లాలని, అతనికి మే6న పెళ్లి కాకపోతే పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటానని అభిమాని బెదిరిస్తుండగా.. విశ్వక్ అతడిని అడ్డుకుని తన కారులో పంపించేస్తాడు. వెనకే ఆటోలో విశ్వక్ వెళ్లిపోతాడు. ఈ ప్రాంక్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది.
అయితే.. సినిమా ప్రమోషన్స్ పేరిట ప్రాంక్ వీడియో న్యూసెన్స్ చేసిన విశ్వక్ సేన్ పై హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేయనున్నట్లు అడ్వకేట్ అరుణ్ కుమార్ తెలిపారు. అతనిపై చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీని ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్ డబ్బాతో అభిమానిని సూసైడ్ చేసుకునేలా వ్యవహరించిన విశ్వక్సేన్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయనున్నారు. ఇలా సినిమా ప్రమోషన్ల పేరుతో రోడ్లపై న్యూసెన్స్ చేస్తూ.. ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారని అరుణ్ కుమార్ వాపోయారు.
Next Story