Mon Dec 23 2024 05:45:30 GMT+0000 (Coordinated Universal Time)
Anjali Patil : సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోయి లక్షలు పోగుట్టుకున్న నటి
ఓ నటి సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోయి లక్షలు పోగుట్టుకున్నారు. ఇంతకీ ఎవరు ఆ నటి..?
Anjali Patil : సైబర్ మోసాల పై పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా, ఎంత అవగాహనా కల్పిస్తున్నా.. ఎవరో ఒకరు ఇంకా ఈ మోసాలకు బలవుతున్నారు. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీస్ సైతం ఈ మోసాలకు గురవుతున్నారు. రీసెంట్ ఓ నటి సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోయి లక్షలు పోగుట్టుకున్నారు. ఇంతకీ ఎవరు ఆ నటి..?
‘నా బంగారు తల్లి’ అనే సినిమాలో నటించి తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్న అంజలి పాటిల్.. తమిళ, హిందీ, మరాఠీ చిత్రాల్లో కూడా నటించారు. అసలు ఏం జరిగిందంటే, ఇటీవల ఈ నటికి దీపక్ శర్మ అనే ఓ వ్యక్తి ఫోన్ చేసి.. తాను ఫెడెక్స్ ఉద్యోగి అని, తైవాన్లో పట్టుబడ్డ డ్రగ్స్ లో అంజలీ ఆధార్ వివరాలు దొరికాయి అని బయపెట్టాడట. దీంతో అంజలీ.. ముంబై పోలీసులకు కంప్లైంట్ చేస్తానని చెప్పి ఫోన్ కట్ చేసేశారట.
అయితే ఆ తరువాత బెనర్జీ అనే వ్యక్తి నుంచి అంజలికి స్కైప్ కాల్ వచ్చిందట. బెనర్జీ తనను తాను ముంబయి సైబర్ పోలీసు విభాగానికి చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకొని.. అంజలీ ఆధార్ కార్డుతో మూడు బ్యాంకు ఖాతాలకు కనెక్ట్ అయ్యిందని, ఆ ఖాతాలు మనీలాండరింగ్ కేసులో చిక్కుకున్నాయని, ఆ కేసు నుంచి అంజలీ బయటపడాలంటే.. ప్రాసెసింగ్ ఫీజు కోసం రూ.96,525, ఇన్వెస్టిగేషన్ కోసం రూ.4,83,291 చెల్లించాల్సి ఉంటుందని చెప్పాడట.
దీంతో బయపడిపోయిన అంజలి ఆ మొత్తం డబ్బుని వారికీ పంపిందట. ఆ తరువాత కొన్నిరోజులకు తాను మోసపోయాను అని గ్రహించిన అంజలీ.. వెంటనే పోలీసులకు పిర్యాదు చేసింది. ప్రస్తుతం సైబర్ పోలీసులు ఈ కేసు పై దర్యాప్తు మొదలు పెట్టారు. అలాగే మరోసారి ప్రతిఒక్కరిని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి మెసేజ్ లు, ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ప్రజలు తెలివితో ఉండాలని కోరుతున్నారు.
Next Story