Mon Dec 23 2024 08:27:02 GMT+0000 (Coordinated Universal Time)
కన్ఫర్మ్.. పెళ్లి చేసుకోబోతున్న హన్సిక
టీవీ సీరియల్స్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించడం ద్వారా తన కెరీర్ను ప్రారంభించిన హన్సిక మోత్వానీ పెళ్లికి సిద్ధమైంది. తెలుగులో దేశముదురు సినిమాతో పాపులారిటీని సంపాదించుకున్న హన్సిక.. ఆ తర్వాత అంత పెద్దగా స్టార్డమ్ ను సంపాదించుకోలేదు. ఆమె ఈ ఏడాది డిసెంబర్లో జైపూర్ కోటలో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. అందుకు సంబంధించి ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. 450 ఏళ్ల నాటి కోటలో పెళ్లి చాలా గ్రాండ్ గా జరగనుందని ఇండియాటీవీ కథనంలో తెలిపింది.
డిసెంబర్లో హన్సిక మోత్వాని పెళ్లి జరగనుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో, హన్సిక పెళ్ళికి సంబంధించి పుకార్లు వ్యాపించాయి. జైపూర్లోని ముండోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్లో హన్సిక పెళ్లి జరగనుంది. ఇదొక డెస్టినేషన్ వెడ్డింగ్ అని చెబుతున్నారు. హన్సిక మోత్వాని పెళ్లికి సంబంధించిన ఖచ్చితమైన తేదీ ఇంకా వెల్లడికానప్పటికీ.. హన్సిక వివాహాన్ని నిర్వహించేందుకు ప్యాలెస్లో గదులు సిద్ధం చేస్తున్నామని, పనులు జరుగుతున్నాయని ప్యాలెస్ నిర్వాహకులు చెబుతున్నారు. జైపూర్లోని ముండోటా కోటకు చేరుకోవాలంటే దేశ రాజధాని న్యూఢిల్లీ నుండి ఐదు గంటల ప్రయాణం. ఇక హన్సిక పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎవరనే విషయమై స్పష్టమైన సమాచారం లేకున్నప్పటికీ ఇది లవ్ మ్యారేజ్ అంటున్నారు.
హన్సిక తమిళ హీరో శింబుతో లవ్ లో ఉందనే వార్తలు గతంలో వచ్చాయి. తమిళంలో అధికంగా చిత్రాలు చేసింది హాసిక. ఈ క్రమంలో హన్సిక శింబు ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకుంటారనే వార్తలు వినిపించాయి. అనూహ్యంగా శింబు-హన్సిక బ్రేకప్ చెప్పుకున్నారు.
Next Story