Mon Dec 23 2024 19:58:51 GMT+0000 (Coordinated Universal Time)
ఆస్పత్రిలో చేరిన ఇలియానా.. ఒక్కరోజులో చాలా మార్పొచ్చిందంటూ పోస్ట్
నా ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని చాలామంది నాకు మెసేజ్ లు పంపుతున్నారు. నేనెంతో అదృష్టవంతురాలిని.
ప్రముఖ స్టార్ హీరోయిన్ ఇలియానా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. చేతికి సిలైన్ సూదితో ఆమె ఫొటో పోస్ట్ చేయడంతో అభిమానులు ఆమెకు ఏమైందా అని ఆందోళన చెందారు. "ఒక్కరోజులో చాలా మార్పు వచ్చింది. డాక్టర్లు సెలైన్స్ పెట్టారు. నా ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని చాలామంది నాకు మెసేజ్ లు పంపుతున్నారు. నేనెంతో అదృష్టవంతురాలిని. డాక్టర్లు సరైన సమయంలో మంచి వైద్యం అందించారు" అని ఇలియానా తన ఇన్ స్టా స్టోరీస్ లో రాసుకొచ్చింది. ఇలియానా ఇన్ స్టా స్టోరీ చూసిన ఫ్యాన్స్ ఆమె త్వరగా కోలుకోవాలి అంటూ ప్రార్థిస్తున్నారు.
దేవదాసు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ గోవా బ్యూటీ.. కిక్, పోకిరి, జల్సా, జులాయి వంటి సినిమాల్లో అగ్రహీరోల సరసన నటించి పాపులర్ అయింది. దేవుడు చేసిన మనుషులు, శక్తి, రాఖీ, మున్నా, అమర్ అక్బర్ ఆంటోనీ, ఖతర్నాక్, భలే దొంగలు, సలీమ్, ఆట, నేను నా రాక్షసి సినిమాల్లో నటించి అలరించింది. కొన్నాళ్లుగా తెలుగు సినిమాల్లో కనిపించట్లేదు కానీ.. హిందీలో అడపా దడపా కనిపిస్తోందీ గోవా బ్యూటీ.
Next Story