Mon Dec 15 2025 08:06:50 GMT+0000 (Coordinated Universal Time)
"మహానటి" కి కరోనా పాజిటివ్
బాలీవుడ్, తమిళ్, తెలుగు పరిశ్రమలకు చెందిన చాలామంది సెలబ్రిటీలు మహమ్మారి వలలో చిక్కుకుంటున్నారు.

ఇటీవల కాలంలో సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే.. 2020లో కరోనా సృష్టించిన క్లిష్ట పరిస్థితులు కళ్లెదుట కదలాడుతున్నాయి. బాలీవుడ్, తమిళ్, తెలుగు పరిశ్రమలకు చెందిన చాలామంది సెలబ్రిటీలు మహమ్మారి వలలో చిక్కుకుంటున్నారు. ఇప్పటి వరకూ మహేష్ బాబు, మంచులక్ష్మి, థమన్, వరలక్ష్మి శరత్ కుమార్, సత్యరాజ్, హెబ్బా పటేల్, బండ్ల గణేష్, త్రిష, ఇషాచావ్లా, రేణు దేశాయ్, లతా మంగేష్కర్, ఖుష్బూ ఇలా చాలామంది వైరస్ బారిన పడ్డారు. దీంతో సినీ పరిశ్రమ వర్గాల్లో ఆందోళన మొదలైంది.
Also Read : సంక్రాంతి తర్వాతే నైట్ కర్ఫ్యూ !
తాజాగా మహానటి సినిమాతో ప్రేక్షకుల మన్ననలు పొందిన హీరోయిన్ కీర్తి సురేష్ కూడా కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. " నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. కొన్ని కరోనా లక్షణాలతో బాధపడుతున్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వస్తుంది అంటే పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. అందరూ కరోనా రాకుండా జాగ్రత్తలు పాటించండి. నేను ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసిన వాళ్లంతా దయచేసి టెస్ట్ చేయించుకోండి. మీరు ఇంకా వ్యాక్సిన్ వేయించుకోకపోతే త్వరగా వేయించుకోండి. మీరు మీ వాళ్ళు అంతా క్షేమంగా ఉండండి. త్వరగా రికవర్ అయి ఫాస్ట్ గా వస్తానని కోరుకుంటుంన్నాను." అని కీర్తి ఆ ట్వీట్ లో పేర్కొంది.
Next Story

