Mon Dec 23 2024 04:27:21 GMT+0000 (Coordinated Universal Time)
అందరి ముందు దర్శకుడిని పట్టుకుని ఏడ్చేసిన హీరోయిన్
ఏడ్చేసిన హీరోయిన్.. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లు అద్భుతంగా చేశారనే
టాలీవుడ్ లో చాలా రోజుల తర్వాత హిట్ సినిమాలు వచ్చాయి. ఈ శుక్రవారం విడుదలైన సీతారామం, బింబిసార సినిమాలు మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. మార్నింగ్ షో నుండే రెండు సినిమాలు మంచి హిట్స్ అని ప్రేక్షకులు తేల్చేశారు. చాలా రోజుల తర్వాత ఈ వీకెండ్ థియేటర్స్ కళకళలాడుతూ ఉన్నాయి.
సీతారామం సినిమా ఒక క్లాసిక్ అని అంటున్నారు. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లు అద్భుతంగా చేశారనే టాక్ నడిచింది. మృణాల్ ఠాకూర్ చాలా గొప్పగా నటించిందని చెబుతున్నారు. మృణాల్ ఠాకూర్ కు ఇది తొలి తెలుగు సినిమా. సీతారామం యూనిట్ హను రాఘవపూడి, మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ హైదరాబాద్ లో ప్రేక్షకుల మధ్య సినిమాను చూశారు. ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో థియేటర్ నుండి బయటికి వచ్చిన అనంతరం మృణాళి ఠాకూర్ భావోద్వేగానికి గురయ్యారు. దర్శకుడు హను రాఘవపూడిని కౌగిలించుకొని ఏడ్చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సీతారామం'. రష్మిక మందన కీలక పాత్ర పోహిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా.
Next Story