Mon Dec 23 2024 18:18:53 GMT+0000 (Coordinated Universal Time)
అల్లు అర్జున్ సరసన డీజే టిల్లు బ్యూటీ ?
తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి స్క్రీన్ చేసుకుందీ బ్యూటీ. అయితే నేహా శెట్టి అల్లు అర్జున్ తో కలిసి నటించింది..
హైదరాబాద్ : ఇటీవల విడుదలైన డీజే టిల్లు సినిమా సూపర్ సక్సెస్ అయింది. ప్రస్తుతం ఓటీటీ లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల చేత.. ఆహా అనిపిస్తూ.. ఆసాంతం కడుపుబ్బా నవ్విస్తోంది. డీజే టిల్లు లో సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా నటించిన నేహా శెట్టి ఫుల్ జోష్ లో ఉంది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి స్క్రీన్ చేసుకుందీ బ్యూటీ. అయితే నేహా శెట్టి అల్లు అర్జున్ తో కలిసి నటించింది సినిమాలో కాదు. ఓ యాడ్ లో.
Also Read : ఐదుగురు భారత జవాన్లను కాల్చి చంపిన జవాన్
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ జొమాటోకు అల్లు అర్జున్ కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. జొమాటో ఇప్పటికే అల్లు అర్జున్ చేసిన ఓ యాడ్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నేహాశెట్టి- అల్లు అర్జున్ చేసిన యాడ్ ప్రోమోను కూడా విడుదల చేసింది జొమాటో. ఈ ప్రోమో వీక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ యాడ్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Next Story