Mon Dec 23 2024 15:28:42 GMT+0000 (Coordinated Universal Time)
నిత్యామేనన్ ఇంట తీవ్రవిషాదం
తనకెంతో ఇష్టమైన అమ్మమ్మను కోల్పోయానని తెలుపుతూ.. ఆమెతో కలిసి ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకుంది.
ప్రముఖ నటి, హీరోయిన్ నిత్యామేనన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ మేరకు ఆమె తన ఇన్ స్టా ఖాతాలో భావోద్వేగంతో కూడిన పోస్ట్ ను షేర్ చేసింది. తనకెంతో ఇష్టమైన అమ్మమ్మను కోల్పోయానని తెలుపుతూ.. ఆమెతో కలిసి ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకుంది. "ఒకశకం ముగిసింది. నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను. గుడ్ బై అమ్మమ్మ. మై చెర్రీమ్యాన్ (తాతయ్య)ను బాగా చూసుకుంటాను" అని ఆ పోస్ట్ కింద రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూసిన నిత్య అభిమానులంతా ఆమెకు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు.
ఈ కలువకళ్ల సుందరి తెలుగు ప్రేక్షకులను "అలా మొదలైంది"తో పలకరించింది. ఆ తర్వాత ఇష్క్ సినిమాతో.. కుర్రాళ్లు మెచ్చిన హీరోయిన్ గా ఎదిగింది. విజయ్, ధనుష్, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ వంటి అగ్రహీరోల సరసన కూడా నటించింది. గతేడాది విడుదల భీమ్లా నాయక్ లో.. పవన్ కల్యాణ్ భార్యగా.. కాస్త గడుసైన పాత్రలో కనిపించి.. అలరించింది. ప్రస్తుతం మలయాళం, తమిళ సినిమాలతో పాటు.. వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉంది.
Next Story