Sun Dec 22 2024 19:47:59 GMT+0000 (Coordinated Universal Time)
మాల్దీవుల్లో పూజా హెగ్డే.. 13 ఏళ్ల తర్వాత ఫ్యామిలీతో !
టాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే మాల్దీవుల ట్రిప్ కి వెళ్లారు. అమ్మ, నాన్న, సోదరుడితో కలిసి 13 ఏళ్ల తర్వాత తాను..
సినిమా సెలబ్రిటీలు కాస్త సమయం దొరికితే చాలు ఏదొక వెకేషన్ కు వెళ్లి.. రిలాక్స్ అవుతుంటారు. టాలీవుడ్ లో అలా సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీ ట్రిప్స్ వేసి.. రిలాక్స్ అయ్యేవాళ్లలో మొదట వినిపించే పేరు అల్లు అర్జున్. బన్నీ తనకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా వెకేషన్ ప్లాన్ చేస్తుంటారు. ఎక్కువగా భార్య, పిల్లలతో కలిసి మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు ఇష్టపడుతుంటారు.
ఆ తర్వాతి ప్లేస్ సూపర్ స్టార్ మహేష్ బాబుదే. ఆయన షూటింగ్ గ్యాప్ దొరికినప్పుడల్లా ఫ్యామిలీ ట్రిప్స్ వేస్తుంటారు. సమయాన్ని బట్టి.. వెకేషన్స్ ప్లాన్ చేస్తుంటారు. ఎక్కువగా దుబాయ్, మాల్దీవ్స్ లోనే ఈ ఫ్యామిలీ రిలాక్స్ అవుతుంటారు. తాజాగా.. టాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే మాల్దీవుల ట్రిప్ కి వెళ్లారు. అమ్మ, నాన్న, సోదరుడితో కలిసి 13 ఏళ్ల తర్వాత తాను అనుకున్న మాల్దీవులకు వచ్చానంటూ పూజా ఇన్ స్టా లో పోస్ట్ చేశారు. అంటే ఇంచుమించు.. ఈ 31 ఏళ్ల పొడుగుకాళ్ల సుందరి టాలీవుడ్ లోకి వచ్చినప్పటి నుంచి మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లలేదనమాట.
Also Read : ఖిలాడి రివ్యూ - హిట్టా ? ఫట్టా ?
కాగా.. పూజాకు ఇన్ స్టాలో కోటి 70 లక్షలకు పైగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటి వరకూ టాలీవుడ్ లో ఏ హీరోకి లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ పూజా సొంతం. పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు త్వరలోనే విడుదల కానున్నాయి. విజయ్ సరసన బీస్ట్ సినిమాలో, బాలీవుడ్ లో సర్కస్, కభీ ఈద్ - కభీ దివాలీ చిత్రాల్లో నటిస్తోంది పూజా హెగ్డే.
Next Story