Sat Jan 11 2025 11:55:05 GMT+0000 (Coordinated Universal Time)
హీరోయిన్ రంభకు తప్పిన పెను ప్రమాదం
సీనియర్ హీరోయిన్ రంభ ఫ్యామిలీ కారు ప్రమాదానికి గురైంది. కెనడాలోని టొరంటోలో స్కూల్ నుంచి పిల్లలను తీసుకొస్తుండగా రంభ ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రంభతో పాటు ఆమె కూతురు సాషాకు గాయాలయ్యాయి. సాషా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. రంభకు మాత్రం స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.
ప్రమాదం నుండి బయటపడ్డాం: రంభ
తాను ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నానని.. తన కూతురు త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలంటూ రంభ సోషల్ మీడియాలో అభిమానులను కోరింది. 'మాకు ఈ రోజు టైం ఏం బాగాలేదు.. బ్యాడ్ టైం బ్యాడ్ డేస్.. ఈ సమయంలో మీ ప్రార్థనలు మాకెంతో ముఖ్యమైనవి' అంటూ రంభ పోస్టు పెట్టింది.
హీరోయిన్ రంభ పెళ్లి చేసుకుని కెనడాలో గడుపుతోంది. ఆమె కుటుంబానికి యాక్సిడెంట్ కావడం ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది. రంభ దక్షిణాదిన మాత్రమే కాకుండా బాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటించింది.
Next Story