Mon Feb 24 2025 21:59:16 GMT+0000 (Coordinated Universal Time)
ఇస్మార్ట్ హీరోతో శ్రీవల్లి నేషనల్ రొమాన్స్ !
బోయపాటి శ్రీను - రామ్ పోతినేని కాంబినేషన్ లో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ మీద..

హైదరాబాద్ : రష్మిక మందన్న.. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్. పుష్ప సినిమాతో రష్మిక మందన్న బీ టౌన్ లో కూడా బాగా ఫేమస్ అయింది. దాంతో అమ్మడు కి వరుసగా సినిమాల ఆఫర్లొస్తున్నాయి. పుష్ప తర్వాత "ఆడవాళ్లు మీకు జోహార్లు" సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన రష్మిక.. పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం పుష్ప -2 కోసం సిద్ధమవుతోంది. ఇంతలో మరో యంగ్ హీరోతో రష్మిక రొమాన్స్ చేయబోతోందంటూ టాక్ వచ్చింది.
బోయపాటి శ్రీను - రామ్ పోతినేని కాంబినేషన్ లో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ మీద శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమా రామ్ కి 20వ సినిమా. సినిమా అధికారిక ప్రకటన అయితే వచ్చింది కానీ.. హీరో తప్ప మిగతా పాత్రలలో ఎవరు నటిస్తున్నారు అనే విషయం మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల మీద దృష్టి పెట్టిన బోయపాటి శ్రీను సినిమాలో నటీనటులను ఫైనల్ చేసే పనిలో పడ్డారట. ఈ సినిమాలో రామ్ సరసన రష్మిక నటిస్తే బాగుంటుందని బోయపాటి అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. రష్మికకు కథ చెప్పగా, ఆమె సూచనప్రాయంగా అంగీకారం తెలిపిందని టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.
News Summary - Heroine Rashmika Mandanna to Romance with Ram Pothineni in Boyapati Film
Next Story