Mon Dec 23 2024 18:29:13 GMT+0000 (Coordinated Universal Time)
Shriya Saran : హీరోయిన్ శ్రియాకి సిస్టర్ కూడా ఉందా.. వీడియో వైరల్..
హీరోయిన్ శ్రియాకి సిస్టర్ కూడా ఉందా..? తిరుమల వెంకన్నని కుటుంబం సమేతంగా దర్శించుకున్న శ్రియాతో ఉన్న ఆ అమ్మాయి ఎవరు..?
Shriya Saran : తెలుగు హీరోయిన్ శ్రియా శరన్కి చెల్లెలు కూడా ఉందా..? ఆమెకు ఒక బ్రదర్ మాత్రమే ఉన్నట్లు అందరికి తెలుసు. బ్రదర్ కి సంబంధించిన ఫోటోలను కూడా శ్రియా గతంలో అభిమానులతో పంచుకున్నారు. కానీ సిస్టర్ గురించిన ఫోటో కాదు కదా ఆమె గురించిన మాట కూడా శ్రియా ఎప్పుడు షేర్ చేసుకోలేదు. కానీ ఇప్పుడు ఆమె పోలికలతో కనిపిస్తున్న ఓ అమ్మాయి వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
శ్రియా రీసెంట్ గా తిరుమల వెంకన్నని కుటుంబం సమేతంగా దర్శించుకున్నారు. శ్రియాతో పాటు ఆమె అమ్మ కూడా వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అయితే వీరితో పాటు ఒక అమ్మాయి కూడా కనిపించింది. ఆమె చూడడానికి శ్రియాలా కనిపిస్తుంది. స్మైల్ అండ్ పేస్ కట్ చూడడానికి శ్రియాలా కనిపిస్తుండడంతో ఆమె శ్రియా సిస్టర్..? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమె శ్రియాకి సొంత సిస్టర్ అవుతుందా..? లేదా సిబ్లింగ్ అవుతుందా..? అనేది తెలియాల్సి ఉంది.
ఆమె సిస్టర్ అయినా, సిబ్లింగ్ అయినా.. చూడడానికి శ్రియాలా అందంగా కనిపిస్తుంది. దీంతో త్వరలో ఆమె కూడా సినిమా ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? ఇన్నాళ్లు ఆమెను బయట పరిచయం చేయని శ్రియా.. ఇప్పుడు బయటకి అందరి ముందుకు తీసుకు రావడంతో.. హీరోయిన్ గా ఎంట్రీ కోసమేనా అనే సందేహాలకు దరి తీస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఆ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Next Story