Mon Dec 23 2024 09:30:54 GMT+0000 (Coordinated Universal Time)
శృతి హాసన్ కు కరోనా : ఇది సరదా అప్డేట్ కాదు
ఈ విషయాన్ని స్వయంగా శృతి తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా వెల్లడించింది. "హాయ్ ఎవ్రీవన్. ఇది సరదా అప్డేట్ కాదు..
హైదరాబాద్ : ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా శృతి తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా వెల్లడించింది. "హాయ్ ఎవ్రీవన్. ఇది సరదా అప్డేట్ కాదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వచ్చేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను" అంటూ పోస్ట్ చేసింది.
Also Read : ఓటీటీలో డీజే టిల్లు.. ఎప్పట్నుంచో మీరే చూడండి !
శృతిహాసన్ పోస్ట్ పై ఆమె అభిమానులు స్పందిస్తున్నారు. త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. వకీల్ సాబ్ తర్వాత శృతిహాసన్ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. ప్రస్తుతం శృతి హాసన్ తెలుగులో బాలకృష్ణ 107వ సినిమాలో, ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న సలార్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.
Next Story