Mon Dec 23 2024 23:01:23 GMT+0000 (Coordinated Universal Time)
హీరోయిన్ కు షాకిచ్చిన హ్యాకర్లు.. ఇన్ స్టా అకౌంట్ హ్యాక్
తాజాగా యామీ గౌతమ్ ఇన్ స్టా అకౌంట్ ను హ్యాకర్లు హ్యాక్ చేశారు. తన ఇన్ స్టా అకౌంట్ హ్యాక్ అయినట్లు యామీ ట్విట్టర్..
ముంబై : ప్రముఖ హీరోయిన్ కు హ్యాకర్లు షాకిచ్చారు. బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితురాలే. టాలీవుడ్ లో యామీ గౌతమ్ నాలుగు సినిమాల్లో నటించింది. గతేడాది ఆమె పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా పలు సినిమాల్లో నటించగా.. ప్రస్తుతం రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరో సినిమా షూటింగ్ దశలో ఉంది.
తాజాగా యామీ గౌతమ్ ఇన్ స్టా అకౌంట్ ను హ్యాకర్లు హ్యాక్ చేశారు. తన ఇన్ స్టా అకౌంట్ హ్యాక్ అయినట్లు యామీ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇన్ స్టా అకౌంట్ ను యాక్సెస్ చేయలేకపోతున్నాని, బహుశా హ్యాక్ అయి ఉండొచ్చని ట్వీట్ లో పేర్కొంది. తన అకౌంట్ ను పునరుద్ధరించే పనులు జరుగుతున్నాయని, ఈ లోపు తన అకౌంట్ నుంచి ఇబ్బందికరమైన పోస్టులు వస్తే... అవి తాను పెట్టినట్టు భావించవద్దని విన్నవించింది. యామీ గౌతమ్ కు ఇన్ స్టా లో 15.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
Next Story