మహేష్ సినిమాలో హీరోయిన్స్ కంఫర్మ్..!
మహేష్ – సుకుమార్ సినిమా క్యాన్సిల్ అయింది. అనిల్ తో మహేష్ సినిమా ఉంటుందని అందరికీ అర్ధం అయిపోయింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి స్క్రిప్టుని పూర్తి స్థాయిలో [more]
మహేష్ – సుకుమార్ సినిమా క్యాన్సిల్ అయింది. అనిల్ తో మహేష్ సినిమా ఉంటుందని అందరికీ అర్ధం అయిపోయింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి స్క్రిప్టుని పూర్తి స్థాయిలో [more]
మహేష్ – సుకుమార్ సినిమా క్యాన్సిల్ అయింది. అనిల్ తో మహేష్ సినిమా ఉంటుందని అందరికీ అర్ధం అయిపోయింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి స్క్రిప్టుని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దే పనిలో ఉన్నాడు. అందుకు సంబంధించిన పనులు కూడా శరవేగంగా సాగిపోతున్నాయి. ఎట్టి పరిస్థితిల్లో ఈ సినిమాను మేలో సెట్స్ మీదకు తీసుకుని వెళ్లాలని టీం భావిస్తుంది. అందుకే ఇతర నటీనటులు, హీరోయిన్స్ ని వెతికే పనిలో ఉన్నారు. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ కి ఛాన్స్ ఉంది. సాయి పల్లవి, రష్మిక మందన్నా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
క్రేజ్ ఉన్న హీరోయిన్లు
వీరు ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్. యూత్ లో కూడా వీరికి మంచి క్రేజ్ ఉంది. ఇద్దరూ ఇంతవరకు మహేష్ తో నటించలేదు కాబట్టి అనిల్ వీరికే ఓట్ వేసాడట. అయితే మేలో సినిమా స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు వీరి డేట్స్ అందుబాటులో ఉంటాయా? లేదా? అనేది అనుమానంగా మారింది. డేట్స్ కుదిరితే ఓకే కానీ కుదరకపోతే అనిల్ వేరే ఆప్షన్ వెతుక్కోవాలి. మహేష్ లాంటి స్టార్ హీరోతో నటించే అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు చెప్పండి. కాబట్టి సాయి పల్లవి, రష్మిక ఆల్మోస్ట్ కంఫర్మ్ అయినట్టే అని టాక్.