ఫ్లాష్ బ్యాక్ కోసం అంతమంది హీరోయిన్లా..?
మన్మధుడు సినిమాకి సీక్వెల్ గా మన్మధుడు 2ని నాగార్జున.. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మొదలై మొదటి షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. మన్మధుడు సినిమా నాగార్జున కెరీర్ [more]
మన్మధుడు సినిమాకి సీక్వెల్ గా మన్మధుడు 2ని నాగార్జున.. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మొదలై మొదటి షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. మన్మధుడు సినిమా నాగార్జున కెరీర్ [more]
మన్మధుడు సినిమాకి సీక్వెల్ గా మన్మధుడు 2ని నాగార్జున.. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మొదలై మొదటి షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. మన్మధుడు సినిమా నాగార్జున కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్. త్రివిక్రమ్ మాటలందించిన ఆ సినిమాలో ఫ్లాష్ బ్యాగ్ లో నాగార్జున అమ్మాయిల వెంటపడే ఆకతాయి కుర్రాడిలా, రిచ్చెస్ట్ పర్సన్ లా.. అలాగే ప్రెసెంట్ లో అమ్మాయిలంటేనే చిరాకు పడి ఆమడదూరం ఉండే వ్యక్తిగా కనిపిస్తాడు. చివరికి ఆఫీస్ లో పనిచేసే సోనాలి బింద్రేని ప్రేమించి పెళ్లాడినట్లుగా దర్శకుడు కథ నడిపించాడు. మధ్యలో కామెడీ అర్థవంతంగా పండించడంతో సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తాజాగా రాహుల్ కూడా కామెడీకి పెద్ద పీట వేస్తూ నాగ్ కి తోడుగా రంగంలోకి వెన్నెల కిషోర్ ని దింపాడు. ఇక మెయిన్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకున్నాడు.
ఫ్లాస్ బ్యాక్ లో ముగ్గురు హీరోయిన్లు
అయితే ఈ సినిమాలో ఇప్పటికే సమంత గెస్ట్ రోల్ ప్లే చేస్తుండగా.. ఫ్లాష్ బ్యాగ్ ఎపిసోడ్ కోసం మరో హీరోయిన్ బెంగళూరు క్యూట్ గర్ల్ అక్షర గౌడని తీసుకున్నారు. తాజాగా మహానటి కీర్తి సురేష్ కూడా మన్మధుడు 2లో అతిథి పాత్రలో మెరవబోతుంది. అయితే ఇంతమంది హీరోయిన్స్ ని గెస్ట్ రోల్స్ కి రాహుల్ రవీంద్రన్ ఎంపిక చెయ్యడానికి ఒక కారణముందట. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ మెయిన్ హీరోయిన్ అంటే ప్రెసెంట్ లో కనబడే హీరోయిన్ అయితే… సమంత, అక్షర గౌడ, కీర్తి సురేష్ ను ఫ్లాష్ బ్యాక్ కోసం తీసుకున్నారట. మరి అతిథి పాత్రలంటే అలా వచ్చి ఇలా వెళ్లిపోకుండా ఒక్కో హీరోయిన్ కి ఒక పది నిమిషాల స్క్రీన్ స్పేస్ ఉండేలా రాహుల్ ఆ హీరోయిన్స్ క్యారెక్టర్స్ ని డిజైన్ చేసినట్లుగా చెబుతున్నారు. మరి నాగార్జున ఈ హీరోయిన్స్ అందరితో ఫ్లాష్ బ్యాక్ లో ఎలాంటి ప్రేమాయణాన్ని నడిపించాడో చూడాలి.