ప్రాఫిట్ పై కన్నేశారు..!
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఓ మల్టీ స్టారర్ రూపొందుతున్న సంగతి తెల్సిందే. డిసెంబర్ నెలలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని వచ్చే ఏడాది జనవరి చివరి నుండి రెగ్యులర్ షూట్ కి రెడీ అవుతుంది. దాదాపు 200 కోట్లు పై బడ్జెట్ తో నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న ఈ సినిమా గురించి ఓ వార్త బయటికి వచ్చి హల్ చల్ చేస్తుంది.
ముగ్గురికీ వాటాలే...
ఈ సినిమా కోసం రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ముగ్గురూ పారితోషకం తీసుకోవడం లేదట. అదేంటి అని ఆశర్యపోతున్నారా? పారితోషికం బదులు వీరు సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చే లాభాల్లో షేర్ తీసుకునేలా నిర్మాత దానయ్యతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. వీరి ముగ్గురి మీద క్రేజ్ తో ఈ సినిమా 400 నుంచి 500 కోట్ల వరకూ బిజినెస్ చేస్తుంది. శాటిలైట్, ఇతర రైట్స్ పరంగా చాలా ఎక్కువే వస్తాయి. కాబట్టి ఇవన్ని ఆలోచించుకునే రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ లాభాల్లో వాటా తీసుకోవాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.
మరి బడ్జేట్ ఎంత..?
దీని ప్రకారం చూస్తే నిర్మాత కూడా భారీ లాభాలను దక్కించుకునే అవకాశ ఉంది. వీరు పారితోషకం తీసుకోకుండా సినిమా చేస్తుంటేనే... బడ్జెట్ 200 కోట్లు పైనే అవ్వుతుందంటే ఈ సినిమా కోసం ఎంత ఖర్చు పెడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. హీరోలు తప్ప ఇంకా ఇతర సాంకేతిక నిపుణులు...ఇతర నటీనటులు ఎవరూ కంఫర్మ్ అవ్వలేదు. త్వరలోనే ఆ వివరాలు తెలియనున్నాయి.