Mon Dec 23 2024 03:34:23 GMT+0000 (Coordinated Universal Time)
Sreeleela - Mrunal : శ్రీలీలని చూసి స్ఫూర్తి పొందానంటున్న మృణాల్..
శ్రీలీలని చూసి గర్వపడుతున్నాను, స్ఫూర్తి పొందానంటున్న మృణాల్ ఠాకూర్.
Sreeleela - Mrunal Thakur : టాలీవుడ్ లో ప్రస్తుతం శ్రీలీల, మృణాల్ ఠాకూర్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. యూత్ లో మంచి క్రేజీని సంపాదించుకుంటూ వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ ముందుకు దూసుకు పోతున్నారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ తో శ్రీలీల నటిస్తుంటే, మృణాల్ ఠాకూర్ యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ తో అభిమానుల మనసు దోచుకుంటున్నారు. మృణాల్ రీసెంట్ గా 'హాయ్ నాన్న' సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు.
నాని హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో పాటు హార్ట్ టచింగ్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా చూసిన శ్రీలీల.. మూవీ పై ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్ వేశారు. "నాని గారు ఎప్పటిలాగానే గుండెను హత్తుకునేలా నటించారు. మృణాల్ ఠాకూర్ తన పర్ఫార్మెన్స్ తో మనసు దోచుకుంది. కియారా ఖన్నా తన క్యూట్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది" అంటూ ఇన్స్టా పోస్ట్ వేశారు.
దీనికి మృణాల్ రియాక్ట్ అవుతూ.. "థాంక్యూ స్వీట్ హార్ట్. నీకు ఈ సినిమా నచ్చినందుకు సంతోషిస్తున్నాను. అలాగే నిన్ను చూసి నేను ఎంతో గర్వ పడుతున్నాను. ఒక పక్క చదువుకుంటూనే సినిమాల్లో కూడా నటించడం అంత ఈజీ కాదు. ఈ విషయంలో నేను నిన్ను చూసి స్ఫూర్తి పొందుతున్నాను" అంటూ ఇన్స్టాలోనే రిప్లై ఇచ్చారు. కాగా హాయ్ నాన్న సినిమాని కొత్త దర్శకుడు శౌరవ్ డైరెక్ట్ చేశారు.
ఇక శ్రీలీల విషయానికి వస్తే.. ప్రస్తుతం మహేష్ బాబు సరసన 'గుంటూరు కారం' సినిమాలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇక పవన్ కళ్యాణ్ తో చేస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ ప్రస్తుతం నిలిచిపోయింది. పవన్ పాలిటిక్స్ లో బిజీ అవ్వడంతో ఈ మూవీ షూటింగ్ ని నిలిపివేశారు. హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.
Next Story