Mon Dec 23 2024 04:41:04 GMT+0000 (Coordinated Universal Time)
Mrunal Thakur : తెలుగు ఫ్యాన్స్ మృణాల్ క్షమాపణలు.. ఎందుకో తెలుసా..
తెలుగు అభిమానులకు క్షమాపణలు చెబుతూ మృణాల్ ఠాకూర్ ఒక వీడియో షేర్ చేసింది. ఇంతకీ మృణాల్ సారీ ఎందుకో తెలుసా..?
Mrunal Thakur : బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ 'సీతారామం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో సీతగా నటించిన తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. దీంతో ఇక్కడ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తనని ఇంత అభిమానిస్తున్న తెలుగు ఫ్యాన్స్ కి మృణాల్ చాలా సార్లు థాంక్యూ చెప్పింది. కానీ తాజాగా అదే అభిమానులకు క్షమాపణలు చెబుతూ ఒక వీడియో షేర్ చేసింది. ఇంతకీ మృణాల్ సారీ ఎందుకో తెలుసా..?
ఇటీవల జరిగిన సైమా అవార్డు వేడుకల్లో మృణాల్ ఠాకూర్.. సీతారామం సినిమాకి అవార్డుని అందుకుంది. ఇక ఈ అవార్డుని అల్లు అరవింద్ మృణాల్ ఠాకూర్ కి అందిస్తూ.. "నేను గతంలో ఓ వేదికపై ఒక హీరోయిన్ (లావణ్య త్రిపాఠి)తో ఒక మాట అన్నాను. తెలుగు కుర్రాడిని పెళ్లి చేసుకొని హైదరాబాద్ కి కోడలిగా రమ్మని చెప్పను. ఆ మాట ఆ హీరోయిన్ నిజం చేసింది. నిన్ను కూడా అదే అడుగుతున్నా.. టాలీవుడ్ కోడలుగా వచ్చేయి" అంటూ అల్లు అరవింద్ వ్యాఖ్యానించాడు.
దీనికి మృణాల్ సిగ్గుపడుతూ బదులిచ్చింది. ఇక ఇక్కడ నుంచి మొదలయ్యాయి మృణాల్ పెళ్లి వార్తలు. ఆమె నిజంగానే తెలుగు కుర్రాడిని పెళ్లి చేసుకోబోతుందంటూ నెట్టింట వార్తలు రావడం మొదలయ్యాయి. ఇవి కాస్త బాగా వైరల్ అవ్వడంతో మృణాల్కి.. తన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, ఇండస్ట్రీ వ్యక్తుల నుంచి కాల్స్ రావడం మొదలయ్యాయట. ఎవరు ఆ తెలుగు అబ్బాయి అంటూ మృణాల్ ఫోన్ చేసి అడుగుతున్నారట. దీంతో ఆమె ఒక క్లారిటీ ఇవ్వడానికి ఒక వీడియో పోస్టు చేసింది.
తెలుగు అభిమానులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. "మీ మనసులు బాధ పెడుతునందుకు నన్ను క్షమించండి. నేను ఏ తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోవడం లేదు. ఆ వార్తలు చూసి నేను నవ్వుకున్నాను. ఇంతకీ ఆ తెలుగు అబ్బాయి ఎవరో నాకు చెప్పండి" అంటూ వీడియోలో మాట్లాడుతూ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
Next Story