Mon Dec 23 2024 06:34:36 GMT+0000 (Coordinated Universal Time)
Nani : విజయ్, రష్మికకు క్షమాపణలు చెప్పిన నాని..
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నకి క్షమాపణలు చెప్పిన నాని. వైరల్ అవుతున్న వీడియో.
Nani : ఈమధ్య కాలంలో నేచురల్ స్టార్ నాని చుట్టూ అనేక వివాదాలు చుట్టుకుంటున్నాయి. రీసెంట్ గా ఇటీవల 'హాయ్ నాన్న' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కార్యక్రమం నిర్వాహకులు చేసిన ఒక పనికి నాని పై విమర్శలు వచ్చేలా చేశాయి. ఆ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నకి సంబంధించిన మాల్దీవ్ వెకేషన్ పిక్స్ ని ఈవెంట్ లో స్క్రీన్ పై ప్లే చేయడం అందర్నీ షాక్ కి గురి చేసింది. ఈ విషయం గురించి విజయ్, రష్మిక ఫ్యాన్స్ నానిని విమర్శిస్తూ వచ్చారు.
ఎందుకంటే నాని తన సినిమా ప్రమోషన్స్ అన్ని దగ్గరుండి చూసుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఆ ఫోటోలని ఈవెంట్ లో ప్లే చేయడం వెనుక కూడా నాని ఐడియా ఉందంటూ పలువురు విమర్శలు చేస్తూ వచ్చారు. తాజాగా ఈ విషయం గురించిన నాని ప్రశ్నించారు. దానికి నాని బదులిస్తూ.. "ఈవెంట్ లో ఆ ఫోటో చూసి నేను కూడా షాక్ అయ్యాను. అయితే మూవీ ఈవెంట్స్ ఎలా జరుగుతాయో, ఎవరు చేస్తారో విజయ్ అండ్ రష్మికతో పాటు అందరికి తెలుసు. ఒకవేళ ఆ విషయానికి ఎవరైనా బాధపడి ఉంటే నా మూవీ టీం మరియు నేను క్షమాపణలు కోరుతున్నాము" అంటూ చెప్పుకొచ్చారు.
ఇక హాయ్ నాన్న విషయానికి వస్తే.. డిసెంబర్ 7న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంటే శృతిహాసన్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. కొత్త డైరెక్టర్ శౌర్యువ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. గతంలో జెర్సీ సినిమాలో ఫాదర్ సెంటిమెంట్ తో ఆడియన్స్ ని ఎమోషనల్ చేసిన నాని మరోసారి అలాంటి ఓ కంటెంట్ తో వస్తుండడంతో సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
ఈ ఏడాది 'దసరా' సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్టుని అందుకున్నారు. ఆ సక్సెస్ ని హాయ్ నాన్నతో కంటిన్యూ చేస్తానంటూ నాని చెబుతున్నారు. మరి పాజిటివ్ బజ్ తో ఉన్న ఈ మూవీతో నాని మంచి విజయాన్ని అందుకుంటాడా లేదా చూడాలి.
Next Story