Sat Apr 12 2025 02:17:05 GMT+0000 (Coordinated Universal Time)
Vyuham : వ్యూహం సినిమా విడుదలకు బ్రేక్
వ్యూహం సినిమా విడుదలపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ను వచ్చే నెల 11 వరకూ సస్పెండ్ చేసింది.

వ్యూహం సినిమా విడుదలపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ను వచ్చే నెల 11 వరకూ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వ్యూహం సినిమా విడుదలకు బ్రేక్ పడింది. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన వ్యూహం సినిమా విడుదలపై స్టే ఇవ్వాలంటూ హైకోర్టును కొందరు ఆశ్రయించిన నేపథ్యంలో ఈ విధమైన ఉత్తర్వులు విడుదలయ్యాయి.
విచారణను...
తదుపరి విచారణను వచ్చే నెల 11వ తేదీకి వాయిదా వేసింది. నారా లోకేష్ దాఖలు చేసిన పిటీషన్ పై విచారించిన విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు నిన్న రాత్రి ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అందిన ఆధారాల నేపథ్యంలో సినిమాకు విడుదల చేసిన సెన్సార్ సర్టిఫికెట్ణు సస్పెండ్ చేసింది. దీంతో రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమా విడుదల వచ్చే నెల 11వ తేదీ వరకూ నిలిచిపోయినట్లే. జగన్ రాజకీయ కధాంశంతో రూపొందించిన చిత్రం ఏపీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో విడుదల కావడంపై టీడీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
Next Story