Mon Dec 23 2024 14:47:42 GMT+0000 (Coordinated Universal Time)
Vyooham : ఆర్జీవీ వ్యూహం రిలీజ్పై కోర్టులో వాదనలు.. రిలీజ్ కష్టమేనా..?
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘వ్యూహం’ సినిమా రిలీజ్ పై హైకోర్టు తుది తీర్పు ఏంటంటే..!
RGV Vyooham : టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘వ్యూహం’ రిలీజ్ పై ఏపీలో రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ ని అడ్డుకోవాలంటూ టీడీపీ నాయకులు కోర్టులో కేసు వేయగా నేడు తెలంగాణా హైకోర్టు తుది తీర్పుని ఇచ్చింది.
హైకోర్టులో ఇరు వర్గాల నుంచి వాదనలు వినిపించారు. ఆర్జీవీ తరుపున సీనియర్ కౌన్సిల్ ఎంపీ నిరంజన్ రెడ్డి వాదించారు. సినిమాకి సెన్సార్ బోర్డు ఇచ్చే సర్టిఫికెటే ఫైనల్ అని, వారే ఎటువంటి అభ్యంతరాలు తెలియజేయలేదని గుర్తు చేసిన నిరంజన్ రెడ్డి.. సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇలా పిటిషన్ వేసే అర్హత లేదని చెప్పుకొచ్చారు.
అయినా ఒక వ్యక్తిని, పార్టీని కించపరిచేలా సినిమా ఉంటే.. సివిల్ కోర్టులో పరువు నష్టం దావా కేసు వేయాలని గాని ఇలా హైకోర్టులో కాదని పేర్కొన్నారు. అలాగే వ్యూహం మూవీ డాక్యుమెంటరీ కాదని, సినిమాగా తెరకెక్కించేటప్పుడు స్వేచ్చ ఉంటుందని, అది కళాకారులకు మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని పేర్కొన్నారు.
టీడీపీ తరుపు న్యాయవాది మురళీ ధర్ రావు వినిపించిన వాదనలు ఏంటంటే.. వ్యూహం సినిమా టిడిపి, జనసేన, కాంగ్రెస్ లీడర్స్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కించారని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్, లోకేష్ ప్రతిష్టని దెబ్బతీసేలా సీన్స్ చిత్రీకరించారని పేర్కొన్నారు. కంప్లీట్ పొలిటికల్ అజెండాతో తెరకెక్కిన ఈ చిత్రం ఏపీ ఎన్నికల సమయంలో తీసుకు రావడం సరికాదని వెల్లడించారు. ఈ సినిమా ప్రజలు పై ప్రభావం చూపించేలా ఉంటుందని పేర్కొన్నారు.
ఇక ఇరు వాదనలు విన్న న్యాయస్థానం.. ఇప్పటివరకు తీర్పుని వెల్లడించలేదు. దీంతో అసలు రేపు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహం నెలకుంది. ఇక ఈ నిరసనలు, గొడవలు చూసి ఏపీ థియేటర్ ఓనర్స్ కి టెన్షన్ తో చెమటలు పట్టుకున్నాయి. ఇప్పుడు ఈ చిత్రాన్ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తే.. థియేటర్ వద్ద ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో అని భయపడుతున్నారు.
Next Story