Mon Dec 23 2024 12:06:59 GMT+0000 (Coordinated Universal Time)
హిట్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్.. రేపు బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్
హిట్ 2 తొలిరోజు దేశ వ్యాప్తంగా ఆరున్నర కోట్లు వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. విదేశీ వసూళ్లతో కలిసి..
అడివి శేష్ కూల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన క్రైమ్ థిల్లర్ 'హిట్2'. డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. హిట్- ది ఫస్ట్ కేస్ సినిమాను తీసిన డైరెక్టర్ శైలేష్ కొలను.. హిట్-ది సెకండ్ కేస్ ను అదే బ్యానర్లో తెరకెక్కించాడు. తొలి సినిమాలో విష్వక్సేన్ నటించగా.. మంచి విజయాన్ని అందుకుంది. దాంతో హిట్ 2 పై ఆది నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. 'మేజర్' చిత్రంతో పాన్ ఇండియా స్థాయి విజయం అందుకున్న అడివి శేష్ హీరో కావడంతో ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
హిట్ 2 తొలిరోజు దేశ వ్యాప్తంగా ఆరున్నర కోట్లు వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. విదేశీ వసూళ్లతో కలిసి 11.27 కోట్ల గ్రాస్ ను వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొదటిరోజు ఈ సినిమా వేసిన థియేటర్లన్నీ హౌస్ ఫుల్ అయ్యాయని టాక్. ఇక వీకెండ్ రోజులైన శని, ఆదివారాలు కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది. పైగా ఈ సినిమాకు పోటీనిచ్చే సినిమాలేవీ లేకపోవడం హిట్ 2 కి ప్లస్ పాయింట్ అయింది.
ఈ సినిమా విడుదలైన ప్రతి ప్రాంతంలో మంచి వసూళ్లను రాబడుతుందంటూ, ఈ సినిమా టీమ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ను నిర్వహిస్తోంది. హైదరాబాదు ఫిల్మ్ నగర్లోని రామానాయుడు స్టూడియోస్ గార్డెన్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు, రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది.
Next Story