Mon Dec 23 2024 06:43:17 GMT+0000 (Coordinated Universal Time)
అప్పుడే ఓటీటీ పార్టనర్ ను లాక్ చేసుకున్న హిట్ 2
ఈ మధ్యకాలంలో విడుదలయ్యే సినిమాలు.. విడుదలకు ముందు ఓటీటీ పార్టనర్ ను లాక్ చేసుకుంటున్నాయి. ఆ విషయాన్ని థియేటర్లోనే..
హిట్.. పార్ట్ 1 వచ్చినపుడు.. దీనికి సీక్వెల్స్ ఉంటాయని డైరెక్టర్ చెప్పగా.. తీసినప్పుడు కదా అనుకున్నారంతా. కానీ..రెండేళ్లలో రెండో ఫ్రాంచైజీని తీశాడు దర్శకుడు శైలేష్ కొలను. హిట్ 'హిట్ 2 ది సెకండ్ కేస్' నేడు విడుదలవ్వగా.. తొలి షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. హిట్ 2 హిట్టయింది. హిట్ కేస్ 1లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా.. హిట్ 2లో అడివి శేష్ హీరోగా నటించారు. నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించిన ఈ సినిమా సూపర్ సక్సెస్ దిశగా దూసుకెళ్తోంది.
ఈ మధ్యకాలంలో విడుదలయ్యే సినిమాలు.. విడుదలకు ముందు ఓటీటీ పార్టనర్ ను లాక్ చేసుకుంటున్నాయి. ఆ విషయాన్ని థియేటర్లోనే రివీల్ చేసేస్తున్నాయి. తాజాగా హిట్ 2 కూడా తన ఓటీటీ పార్ట్ నర్ ఎవరో చెప్పేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే నెలరోజుల తర్వాత ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. ఇక నెక్ట్స్ హిట్ 3 కూడా రాబోతుందని ఈ సినిమా క్లైమాక్స్ లోనే చెప్పేశారు. హిట్ 3లో ముగ్గురు స్టార్ హీరోలు నటించనున్నట్లు తెలుస్తోంది.
Next Story