Mon Dec 23 2024 11:46:41 GMT+0000 (Coordinated Universal Time)
1 మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తున్న హిట్ -2 ట్రైలర్.. ట్విస్టుల మీద ట్విస్టులు
అడివి శేష్ ఒక కూల్ పోలీస్ గా కనిపిస్తాడు. అతనికి ఒక భయంకరమైన కేసును అప్పజెప్తారు. ఆ కేసులో ఊహించని ట్విస్టులు ఎదురవుతుంటాయి.
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. వరుస హిట్లతో దూసుకెళ్తున్న అడివి శేష్ హీరోగా.. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా హిట్ 2. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. విడుదలైన నాలుగు గంటలకే 1 మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తుంది. ట్విస్టుల మీద ట్విస్టులతో.. సినిమాపై అంచనాలను రెట్టింపయ్యేలా చేసిందీ ట్రైలర్. హిట్ ది ఫస్ట్ కేస్ సినిమాతో మెప్పించిన శైలేష్ హిట్ 2 ది సెకండ్ కేస్తో మరోసారి పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మీనాక్షి చౌదరి అడివి శేష్ కు జోడీగా నటించింది.
అడివి శేష్ ఒక కూల్ పోలీస్ గా కనిపిస్తాడు. అతనికి ఒక భయంకరమైన కేసును అప్పజెప్తారు. ఆ కేసులో ఊహించని ట్విస్టులు ఎదురవుతుంటాయి. అత్యాచారం జరగదు కానీ.. అమ్మాయిలు చనిపోతుంటారు. ఒక్కొ అమ్మాయి నుండి ఒక్కో శరీర భాగాన్ని నరికి.. ఒక డెడ్ బాడీగా పడేస్తాడు నిందితుడు. ఆ నిందితుడు ఎవరు ? ఎందుకు వరుసగా అమ్మాయిల్ని చంపుతున్నాడు ? అన్న సస్పెన్స్ తో ట్రైలర్ ను కట్ చేశారు. న్యాచురల్ స్టార్ నాని సమ్పరణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్పై ప్రశాంతి త్రిపిర్నేని సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా హిట్ 2 విడుదల కానుంది.
Next Story