సోమవారం వీక్ అయిన హిట్!!
నాని నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన హిట్ సినిమా మొదటిరోజు మంచి ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. నాని నిర్మాత అనగానే సినిమాపై ఏర్పడిన ఆసక్తి ఓ [more]
నాని నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన హిట్ సినిమా మొదటిరోజు మంచి ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. నాని నిర్మాత అనగానే సినిమాపై ఏర్పడిన ఆసక్తి ఓ [more]
నాని నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన హిట్ సినిమా మొదటిరోజు మంచి ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. నాని నిర్మాత అనగానే సినిమాపై ఏర్పడిన ఆసక్తి ఓ కారణమైతే.. క్రైమ్ థ్రిల్లర్ కథలకు స్పెషల్ కేటగిరి ఆడియన్స్ ఉండడంతో హిట్ కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అలాగే శని ఆదివారాలోనూ హిట్ మంచి కలెక్షన్ సొంతం చేసుకుని బ్రేక్ ఈవెన్ కి దగ్గరైంది. ఇక హిట్ కి అసలు పరీక్ష సోమవారం మొదలయ్యింది. పిల్లలకి పరీక్షల టైం కావడంతో వీక్ డే అయిన సోమవారం హిట్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 40 లక్షల షేర్ తో హిట్ సరిపెట్టుకుని.. మొదటి నాలుగు రోజులకు గాను 3.89 కలెక్షన్స్ కొల్లగొట్టింది.
ఏరియా షేర్ (కోట్లలో )
నైజాం 2.19
సీడెడ్ 0.31
నెల్లూరు 0.09
కృష్ణ 0.28
గుంటూరు 0.27
వైజాగ్ 0.40
ఈస్ట్ గోదావరి 0.17
వెస్ట్ గోదావరి 0.18
టోటల్ ఏపీ & టీస్ షేర్ 3.89
- Tags
- హిà°à±