Sun Dec 22 2024 22:24:56 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీలోకి మసూద.. స్ట్రీమింగ్ ఎప్పటి నుండో తెలుసా ?
థియేటర్లకు వచ్చేంతవరకూ ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. థియేటర్లోకి అడుగుపెట్టిన వాళ్లను ..
చాలా గ్యాప్ తర్వాత సంగీత రీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా మసూద. ఆచార్యలో చేసినా.. అది కేవలం స్పెషల్ సాంగ్ వరకే పరిమితం. విడుదల తేదీ వరకూ ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో అడుగుపెట్టిన మసూద.. వచ్చిన ఆడియన్స్ ని ఊహించని రీతిలో భయపెట్టింది. మంచి కంటెంట్ ఉంటే.. వసూళ్లు వాటంతట అవే వస్తాయనేందుకు ఊదాహరణగా నిలిచిన సినిమాల్లో మసూద ఒకటి. రాహుల్ నిర్మాణంలో .. సాయికిరణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నవంబర్ 18న విడుదలైంది.
థియేటర్లకు వచ్చేంతవరకూ ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. థియేటర్లోకి అడుగుపెట్టిన వాళ్లను మసూద భయపెట్టకుండా వదల్లేదు. ఇలాంటి హార్రర్ సినిమాల్లో టేకింగ్.. ఫొటోగ్రఫీ.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. ఇంత చిన్న సినిమాకి ఇవన్నీ కలిసొస్తాయా అనే సందేహంతో వచ్చిన వాళ్లందరికీ ఆ సందేహాలు తీరిపోతాయి. ఇటీవలే ఈ సినిమా 25 రోజులను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఓటీటీలోనూ విడుదలకు రెడీ అయింది.
డిసెంబర్ 21న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్ ఆహాలో మసూద విడుదల కానుంది. సినిమా మొత్తం దెయ్యం కనిపించదు.. కానీ ప్రేతాత్మకి సంబంధించిన అన్వేషణ ఉంటుంది. ఎక్కడా కామెడీ లేకపోయినా.. ఆ విషయం ఆడియన్స్ కి తెలియదు. మసూద థియేటర్లలో ఎంత భయపెట్టిందో.. ఓటీటీలోనూ అలాగే భయపెడుతుందా లేదో చూడాలి.
Next Story