Tue Dec 24 2024 00:37:33 GMT+0000 (Coordinated Universal Time)
డైరెక్టర్ శ్రీనువైట్ల ఇంట విషాదం
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శ్రీనువైట్ల ఇంట విషాదం నెలకొంది. శ్రీను వైట్ల తండ్రి కృష్ణారావు ఈరోజు మృతి చెందారు.
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శ్రీనువైట్ల ఇంట విషాదం నెలకొంది. శ్రీను వైట్ల తండ్రి కృష్ణారావు ఈరోజు మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా కందులపాలెంలో ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా కృష్ణారావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈరోజు తెల్లవారు జామున శ్రీనువైట్ల తండ్రి కన్నుమూశారు. దీంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది.
టాలీవుడ్ ప్రముఖులు....
శ్రీనువైట్ల కుటుంబం హైదరాబాద్ లోనే నివాసం ఉంటుంది. తండ్రి మరణ వార్త తెలిసిన వెంటనే ఆయన తూర్పుగోదావరి జిల్లాకు బయలుదేరారు. శ్రీను వైట్ల కుటుంబానికి టాలివుడ్ ప్రముఖులు సానుభూతిని ప్రకటించారు. ప్రస్తుతం శ్రీను వైట్ల ఢీ అంటే ఢీ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
Next Story