Mon Dec 23 2024 05:41:31 GMT+0000 (Coordinated Universal Time)
విజయ్ దేవరకొండ ఇచ్చే లక్ష రూపాయలను సొంతం చేసుకోవాలంటే?
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సంతోషాన్ని అభిమానులతో షేర్ చేసుకోవాలని సరికొత్తగా ఆలోచించాడు. ఖుషీకి వచ్చిన రెమ్యూనిరేషన్ లో ఒక కోటి రూపాయలను.. అభిమానుల్లోని 100 మంది ఫ్యామిలీస్ కు ఇస్తున్నా అని చెప్పాడు. తాజాగా ఆ లక్ష రూపాయలు కావాలంటే.. అభిమానులు డీటెయిల్స్ పంపమని ఒక లింక్ షేర్ చేశాడు. అందులో మీరెక్కడ ఉంటారు. మీ కుటుంబంలో ఎంతమంది..? చిన్నపిల్లలు ఎంతమంది.. ఈ లక్ష రూపాయలు మీకు వస్తే ఏం చేస్తారు? అనేది కూడా అడిగారు. అందులో సరైన సమాధానం రాసి పంపిస్తే .. అది విజయ్ మనసుకు నచ్చితే.. ఆ వందమందిలో మీరు కూడా ఒకరు కావచ్చు. విజయ్ పంపిన లింక్ మీద క్లిక్ చేయండి.. లక్ష రూపాయలు గెలుచుకొనే అవకాశం పొందండి.
విశాఖపట్నంలో సక్సెస్ మీట్ వేదికపై మాట్లాడిన విజయ్ దేవరకొండ ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు. ఇంతటి విజయం అందించిన అభిమానులకు ఏదో ఒకటి చేయాలని ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వంద మందికి లక్ష రూపాయల చొప్పున ఒక కోటి రూపాయలు తన రెమ్యునరేషన్ నుండి పంచనున్నట్లు తెలిపాడు. సోషల్ మీడియా వేదికగా అప్లికేషన్ లింక్ షేర్ చేశారు. లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ లో అడిగిన డిటైల్స్ పొందుపరిచి లక్ష రూపాయల కోసం అప్లై చేసుకోవచ్చు. వచ్చిన అప్లికేషన్స్ నుండి వంద మందిని ఎంపిక చేసి వారికి లక్ష రూపాయలు ఇవ్వనున్నారు.
Next Story