Mon Jan 13 2025 01:43:00 GMT+0000 (Coordinated Universal Time)
బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోబోతున్న హీరో మాజీ భార్య..?
నటుడు అర్స్లాన్ గోనీతో డేటింగ్ చేస్తున్న బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుస్సానే ఖాన్
నటుడు అర్స్లాన్ గోనీతో డేటింగ్ చేస్తున్న బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుస్సానే ఖాన్ తన ప్రియుడితో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. గ్రాండ్ గా కాకుండా సింపుల్ గా ఈ జంట పెళ్లి చేసుకునే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఆర్స్లాన్ ఇటీవల సుస్సేన్ను త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు పేర్కొన్న నివేదికలపై స్పందించారు. ఈ వార్తలను చూసి తాను చాలా ఆశ్చర్యపోయానని.. అయితే ఆ వార్తలు ఆనందాన్ని కలిగించాయని అర్స్లాన్ అన్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం తనకు ఇష్టం లేదని, దాని గురించి ఎవరు మాట్లాడారో కూడా తనకు తెలియదని అన్నారు. ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడిగారు.
తన స్నేహితులతో కూడా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం ఇష్టం ఉండదని అర్స్లాన్ హిందుస్థాన్ టైమ్స్‌తో చెప్పుకొచ్చారు. తన పర్సనల్ లైఫ్ బాగుందని, అలాగే తన వర్క్ లైఫ్ కూడా బాగుందని చెప్పారు. అదే సమయంలో తాను ఏదీ దాచకూడదని అనుకుంటూ ఉన్నానని అన్నారు.
సుస్సానే గతంలో హృతిక్ రోషన్‌ను వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. హృదాన్, హ్రేహాన్ లను ఇద్దరూ చూసుకుంటూ ఉన్నారు. పెళ్లయిన 14 ఏళ్ల తర్వాత ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడిపోయినప్పటికీ.. హృతిక్, సుస్సానే వారి పిల్లలకు సహ-తల్లిదండ్రులుగా ఉన్నారు. ఇక బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌తో హృతిక్ న్యాయ పోరాటం చేస్తున్నప్పుడు సుస్సానే హృతిక్‌కు మద్దతుగా నిలిచారు. హృతిక్ ప్రస్తుతం సబా ఆజాద్ తో రిలేషన్ షిప్ లో ఉన్నాడు.
News Summary - Hrithik Roshan ex-wife Sussanne Khan to tie the knot
Next Story