కోత వేసుకుంటే భారీ లాస్ అయ్యే హీరో?
కెరీర్ లో పదేళ్లు వరస ప్లాప్స్ తో వెనకబడిపోయిన హీరో నితిన్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు అయితే రెండేళ్ల క్రితం మూడునాలుగు ప్లాపుల్తో మళ్ళీ వెనక్కి [more]
కెరీర్ లో పదేళ్లు వరస ప్లాప్స్ తో వెనకబడిపోయిన హీరో నితిన్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు అయితే రెండేళ్ల క్రితం మూడునాలుగు ప్లాపుల్తో మళ్ళీ వెనక్కి [more]
కెరీర్ లో పదేళ్లు వరస ప్లాప్స్ తో వెనకబడిపోయిన హీరో నితిన్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు అయితే రెండేళ్ల క్రితం మూడునాలుగు ప్లాపుల్తో మళ్ళీ వెనక్కి వెళ్లిన నితిన్ భీష్మ సినిమాతో హిట్ కొట్టి ట్రాక్ లోకి వచ్చాడు. అయితే భీష్మ తర్వాత వరస సినిమాలను లైన్ లో పెట్టిన నితిన్ ఒకేసారి మూడు సినిమాలను ప్రకటించాడు. అందులో రంగ్ దే షూటింగ్ అప్పుడే పూర్తికావొచ్చినా కరోనా మహమ్మరి అడ్డం పడడంతో నితిన్ అన్ని సినిమాల షూటింగ్స్ వాయిదా పడ్డాయి. రంగ్ దే తర్వాత నితిన్ చంద్ర శేఖర్ యేలేటి, అలాగే అందదున్ సినీమా రీమేక్ చెయ్యడానికి రెడీ అయ్యాడు. ఇక ఇటు కరోనా తో నితిన్ పెళ్లి కూడా వాయిదా పడింది.
మరోపక్క హీరోల రెమ్యునరేషన్ లో కోత అంటూ వార్తలు రావడం చూస్తే ఈ ఏడాది నితిన్ కి భారీ లాస్ తప్పదేమో అనిపిస్తుంది. ఎందుకంటే చంద్ర శేఖర్ యేలేటి సినిమా, అందదున్ సినిమాలు ప్రీ ప్రొడక్షన్ కి చేసుకుంటున్నాయి. మరో పక్క రంగ్ దే సినిమా షూటింగ్ ఆగింది. దానితో నిర్మాతలకు ఇబ్బంది. వడ్డీలు పెరిగిపోవడం, మరోపక్క పారితోషికాల్లో కంట్రోల్ అంటే నితిన్ వరసగా మూడు సినిమాల పారితోషికంలో కోత పెట్టుకోవాలి. ఒకవైపు కెరీర్ లో ఇబ్బంది. మరోవైపు పెళ్లి వాయిదాల మీద వాయిదాలు పడుతూ వ్యక్తిగతంలోను చికాకులు. మరి కరోనా తో ఎవరు ఇబ్బంది పడ్డారో… పడుతున్నారో కానీ.. నితిన్ మాత్రం బాగా ఇబ్బంది పడుతున్నాడు.
- Tags
- nithin