అబ్బో అదరగొట్టేస్తుంది
బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషి పెద్దగా విజయాలు లేకపోయినా.. మంచి డ్రెస్ సెన్స్ తో... పలు ఈవెంట్స్ లో అందరిని ఆకట్టుకునే పర్సనాలిటీ ఉన్న ఫిగర్. ఎంతగా మోడ్రెన్ డ్రెస్ వేసినా హ్యూమలో ట్రెడిషన్ లుక్ మాత్రం దాచలేదు. అమ్మడు కాస్త బొద్దుగా అందరిని కళ్ళతోనే పడెయ్యగల నెరజాణ. తాజాగా హ్యూమా ఖురేషి రజినీకాంత్ పక్కన కాలా సినిమాలో నటించింది. కాలా లో హ్యూమా ఖురేషి చక్కటి ట్రెడిషన్ లుక్ అంటే చీర కట్టులో స్వచ్ఛంద సంస్థ తరుపున పోరాడే అమ్మాయిగా అందరిని మెప్పించింది. మరి బాలీవుడ్ లో అవకాశాలు లేకపోయినా.. తన లుక్స్ తో అందరిని మెస్మరైజ్ చెయ్యగల ఈ భామ తాజాగా ఓ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేయించుకుంది.
ఫెమినా వెడ్డింగ్ టైం కోసం హ్యూమా ఖురేషి చేయించుకున్న ఈ ఫోటో షూట్ మాములుగా లేదండోయ్.. ఆమె వేసిన డ్రెస్సు, అందులోని ఆమె అందాలు మొత్తంగా కలిపి అబ్బబ్బ ఏముందిగా హ్యూమా అనుకునేలా వుంది. మరి కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ... హ్యూమలోని సెక్సీ లుక్స్ అందరిని పడేస్తాయి. మరా ఫోటో షూట్ లో హ్యూమా అందాలు కనిపించి కనిపించకుండా ఉన్నప్పటికీ... ఆ ఫొటోస్ లో ఆమె చూసే చూపు, ఆమె ఒలకబోసే హొయలు.. అన్ని ఇన్ని కావు. ఏది ఏమైనా హ్యూమా మాత్రం అదరగొట్టే లుక్స్ తో అందరిని మత్తెక్కిస్తోంది. మరి ఆ ఫొటోస్ ని మీరు ఓ లుక్కెయ్యండి.
క్రీం కలర్ డ్రెస్సులో... ఎద అందాలతో అమ్మడు చూసే చూపుకి కుర్ర కారు ప్లాటైపోవాల్సిందే. తల మీద పాపిడి చైన్ తో అచ్చంగా పెళ్లి కూతురులా హ్యూమా అందాలను అలా చూస్తూ చూపులతోనే ఆస్వాదించేస్తున్నారు. మరి ఎంతగా సెక్సీ లుక్ లో కనిపించినా హ్యూమలోని ట్రెడిషన్ లుక్ మాత్రం బాగా హైలెట్ అయ్యింది. ఇక మ్యాగజైన్ కవర్ పేజీ కోసం హ్యూమా ఖురేషి చేయించుకున్న ఈ ఫ్యాషన్ ఫోటో షూట్ మాత్రం అందరిని ఆకట్టుకుంటున్నాయి