Mon Dec 23 2024 10:23:36 GMT+0000 (Coordinated Universal Time)
యశ్ వీరాభిమాని.. కేక్ రూపంలో హీరో బొమ్మను తయారు చేసిన అనీల(video)
హైదరాబాద్ బంజారాహిల్స్ కు చెందిన అనీల అనే యువతి.. తన అభిమానాన్ని చాటుతూ.. 5 కేజీల కేక్ ని తయారు చేసింది. 5 రోజుల పాటు
బంజారాహిల్స్ : కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో యశ్ మేనియా మొదలైంది. కేజీఎఫ్ నుంచే యశ్ కు తెలుగురాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. కన్నడ నటుడే అయినా.. తెలుగు ప్రేక్షకుల నుంచి ఈస్థాయిలో అభిమానులు, ఆదరణ ఉండటం పెద్దవిషయమే. అదీకాక.. కేజీఎఫ్ 2 పాన్ ఇండియా సినిమాగా రిలీజై.. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. హిందీలోనూ కేజీఎఫ్ 2 కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నిన్నటి వరకూ హిందీలో కేజీఎఫ్ 2 రూ.413 కోట్లు రాబట్టినట్లు హీరో యశ్ వెల్లడించారు.
కాగా.. యశ్ కు అభిమాని అయిన హైదరాబాద్ బంజారాహిల్స్ కు చెందిన అనీల అనే యువతి.. తన అభిమానాన్ని చాటుతూ.. 5 కేజీల కేక్ ని తయారు చేసింది. 5 రోజుల పాటు శ్రమించి.. చాక్లెట్, కలర్స్, గోల్డెన్ డస్ట్ తో యశ్ రూపాన్ని ఫ్లేవర్డ్ కేక్ గా తయారు చేసినట్లు అనీల వెల్లడించింది. ఆ కేక్ కింద.. యశ్ డైలాగ్ MAY I COME IN.. అని కూడా రాసింది. అనీల ఇలాంటి కేక్ లను తయారు చేయడంలో స్పెషలిస్ట్. యశ్ కేక్ ను వీడియో తీసి నెట్టింట్లో పెట్టగా.. ఆమె టాలెంట్ ను నెటిజన్లు అభినందిస్తున్నారు.
Next Story