Mon Dec 23 2024 10:44:42 GMT+0000 (Coordinated Universal Time)
Salaar : పిల్లల్ని సలార్ చూడనివ్వడం లేదని గొడవపెట్టుకున్న తల్లి..
హైదరాబాద్ కి చెందిన ఓ తల్లి తన పిల్లలతో కలిసి సలార్ చూసేందుకు థియేటర్ కి వెళ్తే.. అక్కడ స్టాఫ్ వారిని అడ్డుకున్నారు. దీంతో ఆమె వారితో గొడవకు దిగింది.
Salaar : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రెండు భాగాలుగా తెరకెక్కిన ‘సలార్’.. ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకు వచ్చింది. భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇక మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో.. ఆడియన్స్ థియేటర్ కి క్యూ కట్టారు. నేడు క్రిస్మస్ హాలిడే అవ్వడంతో.. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమా చూసేందుకు వెళ్తున్నారు.
ఈక్రమంలోనే హైదరాబాద్ కి చెందిన ఓ తల్లి తన పిల్లలతో కలిసి సలార్ చూసేందుకు.. ఉప్పల్ DSL మాల్ లోని సినీపోలీస్ థియేటర్లో టికెట్స్ బుక్ చేసుకుంది. అనంతరం సినిమా చూసేందుకు థియేటర్ కి వెళ్లగా.. అక్కడ థియేటర్ యాజమాన్యం వారిని అడ్డుకుంది. సలార్ సినిమాకి సెన్సార్ బోర్డు A సర్టిఫికేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాబట్టి ఈ చిత్రం చూసేందుకు చిన్న పిల్లలకు అనుమతి లేదు.
అందువలనే థియేటర్ మానేజ్మెంట్.. టికెట్స్ ఉన్నా వారిని లోపలి అనుమతించలేదు. ఇక ఈ A సర్టిఫికేట్ గురించి తెలియని ఆ తల్లి.. "టికెట్స్ బుక్ చేసుకొని వస్తే, మీరు ఎందుకు సినిమా చూడనివ్వరు" అంటూ థియేటర్ స్టాఫ్ పై గొడవ పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఈ సర్టిఫికెట్ విషయాన్ని గమనించి టికెట్స్ బుక్ చేసేటప్పుడు జాగ్రత వహించండి.
ఇక మూవీ కలెక్షన్స్ గురించి మాట్లాడితే.. ఫస్ట్ డే 178 కోట్ల గ్రాస్ని అందుకొని ప్రభంజనం సృష్టించింది. ఇక సెకండ్ డే 117 కోట్లు, థర్డ్ డే 107 కోట్లు అందుకొని.. మొదటి వీకెండ్ పూర్తి అయ్యేపాటికి మొత్తం మీద 402 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. దీని బట్టి చూస్తే షేర్ కలెక్షన్స్ సుమారు 200 కోట్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 700 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. ఇప్పుడు ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే.. షేర్ కలెక్షన్స్ సుమారు 350 కోట్లకు పైగా రాబట్టాలి.
Next Story