Mon Dec 23 2024 03:56:30 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి అంబటిపై హైపర్ ఆది విమర్శలు
బ్రో సినిమా కలెక్షన్స్ గురించి ఏపీలో వాడీ వేడి చర్చ జరిగింది. తనను ఒక క్యారెక్టర్
బ్రో సినిమా కలెక్షన్స్ గురించి ఏపీలో వాడీ వేడి చర్చ జరిగింది. తనను ఒక క్యారెక్టర్ తో ట్రోల్ చేశారని వైసీపీ నేత అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. సినిమాకు పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో చెప్పాలంటూ ప్రశ్నించారు. అంతేకాదు టీడీపీ నేతల నుండి పవన్ కళ్యాణ్ కు విదేశాల నుండి ఈ సినిమా చేసినందుకు రెమ్యునరేషన్ వచ్చిందని ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలపై భోళా శంకర్ సినిమా ఆడియో రిలీజ్ లో నటుడు హైపర్ ఆది విమర్శలు గుప్పించారు. ఎలక్షన్స్ గురించి మాట్లాడిల్సిన వాళ్ళు కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. భోళా శంకర్ దర్శక నిర్మాతలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎంత వచ్చాయనేది వాళ్ళు చెబుతారు. మొన్న కలెక్షన్స్ తక్కువ వచ్చాయట! అవును... ఆయన వెనక వేసుకున్న కలెక్షన్స్ తో పోలిస్తే మన కలెక్షన్స్ తక్కువేనని విమర్శలు చేశారు హైపర్ ఆది. ఈ మధ్య ఒక సారి రాజకీయాల గురించి ఆయన్ను అడిగాను.. రాజకీయ వార్తలు చూడటం మానేశాను అని అన్నారు.. నా తమ్ముడిని ఎవరు పడితే వాళ్ళు తిడుతున్నారు.. అందుకే వార్తలు చూడటం లేదని అన్నారు. ఆయన్ను అవమానించిన వాడ్ని ఆయన వదిలేస్తాడేమో గానీ.. తమ్ముడు మాత్రం వదలడు అందరికీ తిరిగి ఇస్తాడని హైపర్ ఆది అన్నారు. భోళా శంకర్ సినిమా అద్భుతంగా ఉంటుంది. మన కలెక్షన్లను చెప్పడానికి మంత్రి ఉన్నాడని అన్నారు.
Next Story