నేను ఫిట్.. ఇదే సాక్ష్యం!!
టాలీవుడ్ కరోనా తో కంగారు పడుతుంది. అటు షూటింగ్ మొదలెడమంటే కరోనా శాంతించడం లేదు. మధ్యలో టాలీవుడ్ సెలబ్రిటీస్ కి కరోనా పాజిటివ్ రావడం మరో కంగారు. [more]
టాలీవుడ్ కరోనా తో కంగారు పడుతుంది. అటు షూటింగ్ మొదలెడమంటే కరోనా శాంతించడం లేదు. మధ్యలో టాలీవుడ్ సెలబ్రిటీస్ కి కరోనా పాజిటివ్ రావడం మరో కంగారు. [more]
టాలీవుడ్ కరోనా తో కంగారు పడుతుంది. అటు షూటింగ్ మొదలెడమంటే కరోనా శాంతించడం లేదు. మధ్యలో టాలీవుడ్ సెలబ్రిటీస్ కి కరోనా పాజిటివ్ రావడం మరో కంగారు. తాజాగా బండ్ల గణేష్ కి కరోనా పాజిటివ్ రావడం.. అలాగే నాగార్జున ఫ్యామిలీకి సన్నిహితురాలైన శిల్ప రెడ్డికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో.. శిల్ప రెడ్డికి కి బెస్ట్ ఫ్రెండ్ అయిన సమంత కి ఆమె భర్త చైతు కి కూడా కరోనా సోకిందేమో అనే కంగారులో అక్కినేని ఫాన్స్ ఉన్నారు. కానీ నాకు ఎలాంటి కరోనా లేదు.. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెబుతుంది సమంత. లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే జిమ్, టెర్రస్ కూరగాయలు అంటూ హడావిడిగా ఉన్న సమంత స్వయంగా వంట కూడా నేర్చుకుంది. అలాగే నటనలో మెళుకువుల కోసం ఆన్ లైన్ క్లాస్ లు కూడా పెట్టించుకుంది. అయినా సోషల్ మీడియాకి ఎప్పుడు గగ్గరగా ఉండే సమంత ఎప్పటికప్పుడు ఫిట్నెస్ పిక్స్ ని పోస్ట్ చేస్తూనే ఉంది.
ఎప్పటికప్పుడు జిమ్ లో కష్టపడే పిక్స్ ని పోస్ట్ చేసే సమంత తాజాగా యోగాసనాల పిక్స్ ని పోస్ట్ చేస్తుంది. మొన్నటికి మొన్న ప్రాణాయామం చేస్తున్న యోగ పిక్ పోస్ట్ చేసిన సమంత తాజాగా గాల్లో తేలుతూ వేసిన యోగాసనం పిక్ పోస్ట్ చేసింది. ఒక్క చెయ్యి మాత్రమే నెలకి తాకించి.. మిగతా బాడీని గాల్లో లేపి చేసిన యోగాసనం అందరిని ఆకట్టుకుంటుంది. మరి ఇలాంటి పిక్స్ తో తనెంత ఫిట్ గా ఉన్నానో చెప్పకనే చెబుతుంది సమంత . తనకి కరోనా లేదని.. గొంతెత్తి చెప్పడం కాదు.. ఇలా జిమ్, యోగ పిక్స్ తోనూ చెప్పి తాను ఫిట్ గా ఉన్నానని.. ఇదే సాక్ష్యం అంటూ చూపిస్తుంది.
- Tags
- Samantha Yoga