నాకు ఆర్ధిక ఇబ్బందులా ఎవరు చెప్పారు!!
చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చి బాలనటిగా ఫేమ్ తెచ్చుకుని, తర్వాత హీరోయిన్ గా మరి చాలా తక్కువ సమయంలోనే ఫెడవుట్ అయిన రాశి.. బరువు పెరగడంతో ఆమెకి ఆఫర్స్ [more]
చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చి బాలనటిగా ఫేమ్ తెచ్చుకుని, తర్వాత హీరోయిన్ గా మరి చాలా తక్కువ సమయంలోనే ఫెడవుట్ అయిన రాశి.. బరువు పెరగడంతో ఆమెకి ఆఫర్స్ [more]
చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చి బాలనటిగా ఫేమ్ తెచ్చుకుని, తర్వాత హీరోయిన్ గా మరి చాలా తక్కువ సమయంలోనే ఫెడవుట్ అయిన రాశి.. బరువు పెరగడంతో ఆమెకి ఆఫర్స్ బాగా తగ్గాయి. ఇక హీరోయిన్ గా అవకాశాలు తగ్గాక వ్యాంప్ కేరెక్టర్స్ కూడా చేసిన రాశి తర్వాత పెళ్లి చేసుకుని కూతుర్ని కన్నాక సినిమాలకు దూరమైంది. అయితే మళ్ళీ రెండేళ్ల క్రితం రాశి సినిమాల్లోకి అమ్మ పాత్రలతో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం చిన్న చిన్న కేరెక్టర్స్ చేసుకుంటున్నా రాశికి ఆర్ధిక ఇబ్బందులు అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియా కెక్కింది.
సినిమాల్లో అవకాశాలు రాక రాశి ఇబ్బందులు పడుతుంది అని, పెళ్లి తర్వాత రాశి మళ్ళీ సినిమాల్లోకి వచ్చింది కూడా ఆర్ధిక ఇబ్బందులు వలెనే అంటూ ఆ న్యూస్ సారాంశం. అయితే తాజాగా రాశి మాట్లాడుతూ.. నాపై వస్తున్న ఈ వార్తల్లో నిజం లేదని చెప్పడమే కాదు… తనకు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని స్పష్టం చేసింది. భర్త, కూతురు కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నానని చెప్పిన రాశి సమస్యలు ఎవరికైనా వస్తుంటాయని… వాటిని దాటుకుంటూ ముందుకు సాగాలని అంటుంది. అయితే ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పిన రాశి ఇబ్బందులు ఎవరికైనా వస్తాయి.. దానిని దాటుకుంటూ వెళ్లాలని చెప్పడంలో ఆంతర్యమేమిటో రాశినే చెప్పాలి.
- Tags
- Rasi